Home Filmy Adda అనుష్క కాదు… ఆ “బాలీవుడ్” స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్న ప్రభాస్..?

అనుష్క కాదు… ఆ “బాలీవుడ్” స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్న ప్రభాస్..?

by Mohana Priya

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చాలా వైరల్ అయ్యాయి.

అయితే ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. మామూలుగా చాలా రోజుల నుండి ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారు అంటూ ఎన్నో పుకార్లు వస్తున్నాయి. కానీ వాళ్ళిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ నిజంగానే ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ అది అనుష్కతో కాదు. ప్రభాస్ ఒక బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారు అనే ఒక వార్త ప్రస్తుతం చర్చలో నిలిచింది. ప్రభాస్ బాలీవుడ్ నటి కృతి సనన్ తో ప్రేమలో ఉన్నారు అనే వార్త వస్తోంది.

prabhas is in love with this bollywood star heroine

వీరిద్దరూ ఆదిపురుష్ షూటింగ్ చేసే సమయంలో ప్రేమలో ఉన్నారు అని, అప్పుడే వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది అని సమాచారం. షూటింగ్ సమయంలోనే కృతి సనన్ ప్రభాస్ ని ఇష్టపడ్డారు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అయితే ఇప్పటివరకు తెలియదు. ప్రస్తుతం ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ కూడా వారి సినిమాలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

You may also like