Home Filmy Adda “పాన్ ఇండియన్ స్టార్” అయిన తర్వాత కూడా… “ప్రభాస్”కి ఈ కష్టాలేంటి..?

“పాన్ ఇండియన్ స్టార్” అయిన తర్వాత కూడా… “ప్రభాస్”కి ఈ కష్టాలేంటి..?

by Mohana Priya

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌ తర్వాత ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

reason behind prabhas movies disappoing after bahubali

అయితే ప్రభాస్ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర ఇండియన్ భాషల్లో కూడా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రభాస్ ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉంది. అలాగే ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ప్రభాస్ కి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ కేవలం మన తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకి ఒక నార్త్ ఇండియన్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు అయిన ఓం రౌత్ పేరు తెలుగు ప్రేక్షకులకి తెలియదు.

reason behind prabhas movies disappoing after bahubali

ఆ డైరెక్టర్ కి తెలుగులో పెద్దగా పరిచయం లేకపోవడం వలన ప్రభాస్ సినిమాపై కూడా ప్రభావం చూపుతోంది. నిర్మాతలు అనుకున్నట్లుగా ఈ సినిమా బిజినెస్ జరగట్లేదు అని సమాచారం. ఒక్క కన్నడ భాషలో తప్ప మిగిలిన ఏ భాషలో కూడా ఈ సినిమా బిజినెస్ సరిగ్గా లేకపోవడంతో ప్రస్తుతం నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ని ఒక యాక్షన్ రోల్ లో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా, అది కూడా యాక్షన్ సినిమా అయిన సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ కి ఒక సరి కొత్త లుక్ ఇచ్చే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నారు అని సమాచారం.

You may also like