సంక్రాంతి పై కన్నేసిన ప్రభాస్ ఏ సినిమా అంటే…!

సంక్రాంతి పై కన్నేసిన ప్రభాస్ ఏ సినిమా అంటే…!

by Mounika Singaluri

Ads

సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాక్ పాట్ లాంటిది. ప్రతి హీరోలు, ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత తమ సినిమాను సంక్రాంతి విడుదల చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. పండగ సీజన్ లో కలెక్షన్స్ పరంగా మంచి రికార్డులు నమోదు చేయవచ్చు. అందుకే పోటా పోటీ పడి మరి సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.

Video Advertisement

ఈ ఏడాది సంక్రాంతికి కూడా అరడజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ ,రవితేజ నటిస్తున్న ఈగల్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామి రంగా సినిమా, డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి పోటీగా వస్తున్నాయి.

project-k-first-glimpse

అయితే ప్రభాస్ కూడా సంక్రాంతి పై కన్నేసాడని వార్త వినిపిస్తుంది. అదేంటి మొన్నే కదా సలార్ తో ప్రభాస్ వచ్చాడు. మళ్ళీ సంక్రాంతికి సినిమా విడుదల చేయడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ పూర్తి వివరాలు చూడండి. ప్రభాస్ వచ్చేది ఈ సంక్రాంతికి కాదు 2025 సంవత్సరంలోని సంక్రాంతికి అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

Prabhas-Project-K-First-Look

ఇప్పటికే డేట్ ని కూడా లాఫ్ చేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే షూటింగ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందట. ఇంకా సంక్రాంతి సీజన్ సంవత్సరం పైనే ఉండగా కూడా అప్పుడే డేట్ ని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీన్ని బట్టి మేకర్స్ ఎంతటి ప్లానింగ్ తో ఉన్నారో అర్థమవుతుంది. నిజంగా ప్రాజెక్ట్ K గనక సంక్రాంతికి వస్తే దీనితో పోటీ పడటానికి ఏ పెద్ద సినిమా సాహాసించకపోవచ్చు. ప్రాజెక్ట్ K ని హాలీవుడ్ స్థాయిలో మేకర్స్ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు.


End of Article

You may also like