Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చాలా వైరల్ అయ్యాయి.
ఇవన్నీ మాత్రమే కాకుండా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమా మొత్తం తాత మనవడి మీద నడుస్తుందట.
రాజా డీలక్స్ అనేది ఒక పాత థియేటర్ పేరు. అది ప్రభాస్ పూర్వీకులకి సంబంధించిన థియేటర్. ప్రభాస్ ఆ థియేటర్ కోసం ఎలా పోరాడారు? ఆ థియేటర్ ని ఎవరు తీసుకున్నారు? అనే విషయం చుట్టూ కథ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద సెట్ వేశారు. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుందట. ప్రముఖ నటి మాళవిక మోహనన్ ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటుల వివరాలు కానీ లేదా సాంకేతిక వివరాలు కానీ బయటకు రాలేదు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే విడుదల అవుతుంది అని సమాచారం. ఒకవేళ సినిమా కథ ఇదే అయితే మాత్రం ఇలాంటి కథ ప్రభాస్ చేయడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
End of Article