SALAAR RUN TIME: ప్రభాస్ నటించిన సలార్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా…?

SALAAR RUN TIME: ప్రభాస్ నటించిన సలార్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా…?

by Mounika Singaluri

Ads

బాహుబలి ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తారీఖున విడుదల కానుంది. ఒక తెలుగు కన్నడలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో సలార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేకర్స్ భారీ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ అన్ని ఊపందుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమా రిలీజ్ ముందు మరో యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Video Advertisement

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.అయితే ఇప్పుడు సలార్ సినిమాల రన్‌టైంకు సంబంధించిన వార్త ఇప్పుడు ఫిలింనగనర్ సర్కిల్‌ లో హల్ చల్ చేస్తోంది. సలార్ రన్‌ టైం 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు. యాక్షన్ డ్రామా కావడం, రన్‌ టైం ఎక్కువ ఉండటం.. సినిమాపై హైప్ మరింత పెంచేస్తుంది.

కేజీఎఫ్‌ సినిమాకు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారాన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తుందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


End of Article

You may also like