బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఆది పురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో రాముడుగా ప్రభాస్ నటించగా సీతగా కృతి సనన్ నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా వున్న ప్రేక్షకులకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

prabhas aadipurush movie is getting delayed again..

అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యంగా జరగడంతో ఈ మూవీ కాస్త ఆలస్యంగా రిలీజ్ అవ్వబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ నెగటివ్ రివ్యూస్ తప్పలేదు. అందరినీ ఈ టీజర్ డిసప్పాయింట్ చేసింది. అయితే ఇంకో 200 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని పాత్రలను మళ్ళీ రీ షూట్ చేశారని తెలుస్తోంది ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడు పాత్రని చేస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకురానున్నారు. భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

prabhas next film with lokesh kanagaraj..

తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోతుంది. ఎవరికైనా అంతే. చాలా మంది నటులు కూడా ఈ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. విగ్గులు వాడుతున్న నటులు కూడా వున్నారు. బట్టతల గురించి తెలీకూడదని ఇండియాలో చాలా మంది స్టార్స్ విగ్గులని పెట్టుకుంటున్నారు. హీరో ప్రభాస్ జుట్టు మీద కూడా అనుమానాలు ఎప్పటి నుండో కలుగుతున్నాయి.

సాహో నుండి ప్రభాస్ జుట్టు సహజంగా లేదు. నిట్ క్యాప్ తో జుట్టు ని ప్రభాస్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కవర్ చేస్తున్నారు. ఆయన విగ్గు వాడుతున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అయితే ఆయన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ ని సెట్ చేస్తుంటే ఇలాంటివి ముందు చెయ్యమని ప్రభాస్ అన్నారు. ఇలా హెయిర్ ని సెట్ చేస్తున్న పద్దతి చూస్తే అది విగ్గులానే వుంది. ఇది విగ్గే అని.. ఇదిగో ప్రూఫ్ అని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.