PRABHAS SALAAR: ట్రైలర్ లోనే అనుకుంటే సినిమాలో లో కూడా అంతే అంటగా.? ఇదెక్కడి ట్విస్ట్ నీల్ మావా.?

PRABHAS SALAAR: ట్రైలర్ లోనే అనుకుంటే సినిమాలో లో కూడా అంతే అంటగా.? ఇదెక్కడి ట్విస్ట్ నీల్ మావా.?

by kavitha

Ads

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

Video Advertisement

ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఐటీవలె ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ట్రైలర్ రానే వచ్చింది. అయితే ఈ సినిమాపై అనేక రకాల సందేహాలు మొదలవుతున్నాయి. పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎదో ఊహించుకున్నాం కానీ, ట్రైలర్ ఆ రేంజ్ లో అసలు లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో అసలు ప్రభాస్ చాలా తక్కువ నిడివి కనిపించడం తో అభిమానులు బాగా నిరాశకి గురి అయ్యారు.

అంతే కాదు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా ఆడియన్స్ కి రొటీన్ అనిపించింది. అయితే ప్రభాస్ ట్రైలర్ లో తక్కువ నిడివి కనిపించడంతో సినిమాలో కూడా అదే విధంగా కనిపిస్తాడా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూడా అదే వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ సేపు మాత్రమే కనిపిస్తాడట. ఆయన ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందని తెలుస్తోంది. అంటే ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదట. దీంతో అభిమానులు కాస్త భయపడుతున్నారు.

prabhas salaar movie main twist leaked

కానీ ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత నుండి సినిమా మరో లెవెల్ లో ఉంటుందని, కచ్చితంగా ఫ్యాన్స్ కి ప్రభాస్ ఉన్న సన్నివేశాలు మొత్తం గూస్ బంప్స్ రప్పిస్తామని, ఇన్ని రోజులు ఎలాంటి ప్రభాస్ ని చూడాలని అభిమానులు కోరుకున్నారో, అలాంటి ప్రభాస్ ని చూపించారని ఫిలిం నగర్ నుండి అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఈ ప్రభాస్ నిడివి ఎంతసేపు ఉంటుంది అన్న పూర్తి వివరాలు తెలియాలి అంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే మరి.


End of Article

You may also like