Ads
Prabhu Deva: సినిపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. హీరో ప్రభుదేవా అలాంటి వారిలో ఒకరు. ఆయన కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రభుదేవాను ఇండియా మైకేల్ జాక్సన్ అని అభిమానులు పిలుస్తారు.
Video Advertisement
ఆయన నటుడిగాను విజయం సాధించారు. ప్రభుదేవా హీరోగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ తరువాత దర్శకుడిగా మారి సక్సెస్ పొందారు. తెలుగులో ప్రభుదేవా నిర్మాత ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా సిద్ధార్థ్,త్రిష హీరోహిరోయిన్లుగా నటించిన నువ్వేస్తానంటే నేనొద్దంటానా సినిమా ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుదేవా దర్శకత్వంలో 2005లో తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీ 9 భాషల్లో రీమేక్ అయ్యింది. అందులో 7 స్వదేశీ భాషలు కాగా, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ సినిమా రీమేక్ చేసిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రభుదేవా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ స్టార్ హీరోలతో వరుస మూవీస్ చేస్తూ బిజీ డైరెక్టర్‌గా అయ్యాడు. ప్రభుదేవా ఎక్కువగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మరోసారి నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా కొనసాగలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.తాజాగా ప్రభుదేవా గురించిన ఒక పోస్ట్ పై సోషల్ మీడియాలో పై చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రభుదేవా ఇంస్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ మరియు ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటు ఫోటోలను కలిపి పెట్టారు. అయితే ప్రభుదేవాకి 380k ఫాలోవర్స్ ఉండగా, ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటుకి 473k ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టిన కొన్ని గంటల్లోనే పోస్ట్ కి 14 k లైక్స్ వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అక్కౌంట్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేస్తే, మరి కొంతమంది ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు.
https://www.instagram.com/p/ClyAmCQJhs0/?igshid=MDJmNzVkMjY=
End of Article