తండ్రి చేపట్టిన డాన్స్ మాస్టర్ వృత్తినే కొనసాగించి ఇండస్ట్రీ కి డాన్స్ మాస్టర్ గా పరిచయం అయ్యి తర్వాత హీరోగా నటించి దర్శకుడిగా మారారు ప్రభుదేవా ..కాగా బాలీవుడ్ లో బడా హీరోలతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ..ప్రభుదేవాను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా అభివర్ణిస్తారు. కాగా ఎంతో మంది డాన్సర్లకు ఆయన ఒక ఆరాధ్య దైవం.

Video Advertisement

ఇండియన్ డాన్స్ మాస్టర్ ఎవరు అంటే మొదట గుర్తు వచ్చేది ఈయన పేరే .కాగా ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు .. కాగా ప్రభుదేవా వివాహ జీవితంతో పాటు ప్రేమ కూడా చిన్నాభిన్నమైంది .ప్రభుదేవా కి పెళ్ళై చాలా ఏళ్ళు అయిన తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడడం గురించి అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది .కాగా ప్రభుదేవా ..నయనతార ప్రేమ వ్యవహారంలో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు.

రమాలత్ ముస్లిం యువతి .కాగా ప్రభుదేవా  కోసం హిందూ మతంలోకి మారి అతడిని పెళ్లి చేసుకొంది. ఈ సంఘటనను చుస్తే మనకు అర్ధం అవుతుంది రమాలత్ ప్రదూదేవాను ఎంత గాఢంగా ప్రేమించారో అని .కానీ నయనతార తన భర్త జీవితంలోకి వచ్చాక తన జీవితం విచ్చిన్నం అయిందని రమాలత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి ..

నయనతారతో ప్రేమలో పడ్డాక ప్రభుదేవా తన భార్య రమాలత్ కు 2011లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రమాలత్ నయనతారపై తన వ్యాఖ్యలతో విరుచుకు పడింది .నయనతార కాపురాలు కూల్చేవ్యక్తి ఆమె కనిపిస్తే తగేలేస్తానని నా కాపురాన్ని నాశనం చేసింది అంటూ రమాలత్ తన బాధను వ్యక్తపరిచారు ..కావాలనే నా భర్తను నా నుండి దూరం చేసిందని అయినా పెళ్లి అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం ఎంత వరుకు సమంజసం అని రమాలత్ తన ఆవేదనను వ్యక్తపరిచారు .

మా కాపురం 15 సంవత్సరాల పాటు ఆనందంగా సాగిందని ప్రభుదేవా మాకోసం సొంత ఇల్లు కూడా కొన్నారని కానీ నయనతార వచ్చిన తరవాత నా జీవితం పూర్తిగా మారిపోయిందని అని బాధపడ్డారు రమాలత్ నయనతార మా కాపురాలు కూల్చుతుంది అంటూ కామెంట్స్ చేసారు.కాగా కొంతకాలం తర్వాత విభేదాల కారణంగా ప్రభుదేవా ,నయనతార విడిపోయిన సంగతి మనకు తెలిసిందే ..