Ads
దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రయాణం మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా నువ్వే నువ్వే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా బృందం అంతా కూడా మళ్లీ కలిసి సినిమా ప్రీమియర్ షో చూశారు.
Video Advertisement
ఈ ప్రీమియర్ షో కి సినిమాలో నటించిన నటీనటులు అందరూ, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సినిమా బృందం అంతా మీడియాతో మాట్లాడి సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. అలా ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కూడా సినిమాకి సంబంధించి ఒక విషయం చెప్పారు.
ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో హీరోయిన్ హీరోని కలిసి వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తండ్రి ప్రకాష్ రాజ్, “ఎక్కడికి వెళ్లావు?” అని అడుగుతాడు. అందుకు హీరోయిన్, “ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను” అని చెప్తుంది. “సరే భోజనం చేద్దాం రా” అంటే, “ఆకలిగా లేదు. తినేసి వచ్చాను” అని అంటుంది. ఈ సీన్ కి సంబంధించి ప్రకాష్ ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఈ సీన్ లో హీరోయిన్ శ్రియ మాట్లాడి, మెట్లు ఎక్కి, పైకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటారు.
“ఈ సీన్ త్రివిక్రమ్ వివరించి 20 సంవత్సరాలు అయ్యింది అయినా కూడా త్రివిక్రమ్ ఈ సీన్ చెప్పిన విధానం ఇప్పటికి కూడా గుర్తు ఉంది” అని ప్రకాష్ రాజ్ అన్నారు. “హీరోయిన్ మెట్లెక్కి, వెళ్ళిపోయి, తన గది తలుపు మూసిన తర్వాత ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవాలి. నేను ఆ డోర్ సౌండ్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. త్రివిక్రమ్ గొప్ప రచయిత మాత్రమే కాదు. గొప్ప దర్శకుడు కూడా. కేవలం తను అనుకున్న విషయాన్ని మాటల ద్వారా మాత్రమే కాకుండా ఇలా మాట్లాడిన తర్వాత వచ్చే నిశ్శబ్దం రూపంలో కూడా చూపించాలి అని అనుకున్నారు. అందుకే త్రివిక్రమ్ దర్శకుడు అయ్యారు” అని ప్రకాష్ రాజ్ చెప్పారు.
watch video :
End of Article