Ads
విలన్ పాత్రలను అద్భుతంగా చేసి ప్రకాష్ రాజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. తనకి వచ్చిన మంచి అవకాశాలను వినియోగించుకుంటూ కెరియర్ లో మంచిగా సక్సెస్ అయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ రీల్ లైఫ్ లో మాత్రమే విలన్ అని రీయల్ లైఫ్ లో ఆయనకీ మంచి మనసు ఉందని ప్రకాష్ రాజ్ ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు.
Video Advertisement
తాజాగా ఆయన మరో మంచి పని చేసి ప్రశంసలు పొందారు. ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న ఒక యువతికి ప్రకాష్ రాజ్ సహాయం అందించారు. శ్రీ చందన అనే ఒక అమ్మాయి టాలెంట్ తో పరీక్షల్లో మంచి మార్కులు సాధించారు. బ్రిటన్ లో మాస్టర్ చదివే అవకాశాన్ని ప్రకాష్ రాజ్ ఆమెకి కల్పించారు.
అయితే ఆమె బ్రిటన్ కి వెళ్ళడానికి ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. తన తండ్రి కూడా మరణించడంతో కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమె కి సహాయం అందించి కెరియర్ లో స్థిరపడేలా చేశారు. శ్రీ చందనకు ప్రకాష్ రాజ్ ఆర్థిక సహాయం తో పాటు మాస్టర్స్ కి అయ్యే ఖర్చు కూడా భరించారు. అలానే ఆమెకి ఉద్యోగం కూడా వచ్చేలా చేసారు ప్రకాష్ రాజ్.
End of Article