ప్రకాష్ రాజ్ గారు చేసిన ఈ సహాయం గురించి తెలుస్తే…హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.!

ప్రకాష్ రాజ్ గారు చేసిన ఈ సహాయం గురించి తెలుస్తే…హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.!

by Mohana Priya

Ads

ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో ఏ పాత్ర అయినా పోషించగల నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. తన వయసుకు మించిన పాత్ర అయినా, వయసుకి తగ్గ పాత్ర అయినా, తన వయసు కంటే చిన్న వయసు ఉన్న పాత్ర అయినా ఒకటే రకమైన ఈజ్ తో పర్ఫార్మ్ చేస్తారు ప్రకాష్ రాజ్. సినిమాల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఇంకొక పక్క తన పొలిటికల్ కెరియర్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. తనకు ఏదైనా కరెక్ట్ కాదు అనిపిస్తే ఎవరికి భయపడకుండా తను అనుకున్నది సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తారు ప్రకాష్ రాజ్.

Video Advertisement

అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా సహాయం కావలసి ఉంటే తన వంతు సహాయం చేయడంలో కూడా ముందుంటారు ప్రకాష్ రాజ్. టైమ్స్ ఆఫ్ ఇండియా.ఇండియా టైమ్స్ కథనం ప్రకారం వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన శ్రీ చందన కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. శ్రీ చందన కి యూకే లోని మాంచెస్టర్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ లో అడ్మిషన్ వచ్చిందట.

కానీ ఆర్థిక సమస్యల కారణంగా శ్రీ చందన యూనివర్సిటీ ఫీజు కట్టలేక, అక్కడికి వెళ్లి చదువుకునే ఆలోచనను వదిలేద్దాం అనుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ శ్రీ చందన ట్యూషన్ ఫీజు, ఇంకా ఉండటానికి అవసరం అయ్యే మొత్తం కట్టారట. సహాయం అందుకున్న తర్వాత శ్రీ చందన ప్రకాష్ రాజ్ ని కలిశారు.

తనకి తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని, అప్పటి నుంచి తన తల్లే కుటుంబాన్ని చూసుకుంటున్నారు అని, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని అనుకున్నాను అని, కానీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కి అయ్యే ఖర్చు భరించలేనని, ఒక ఫ్రెండ్ ద్వారా ప్రకాష్ రాజ్ ఈ విషయం తెలుసుకొని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అని,

కాలేజ్ ఫీజు తో పాటు, రోజువారి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నారు అని, ప్రకాష్ రాజ్ సర్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను అని, ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఇంపార్టెన్స్ ని ప్రకాష్ రాజ్ తనకి నేర్పించారు అని శ్రీ చందన చెప్పారు.


End of Article

You may also like