Home Filmy Adda రాజీనామాకి ముందు మంచు విష్ణుకి ప్రకాష్ రాజ్ మెసేజ్.! వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్.!

రాజీనామాకి ముందు మంచు విష్ణుకి ప్రకాష్ రాజ్ మెసేజ్.! వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్.!

by Mohana Priya

ఎంతో ఉత్కంఠగా జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలిచారు. ఈ ఎలక్షన్స్ లో ఎంతో మంది సినీ ప్రముఖులు పోటీ చేశారు. అధ్యక్ష పదవికి అయితే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు చివరి పోరులో నిలబడ్డారు. ఎలక్షన్స్ ప్రచారం లో భాగంగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ అలాగే ఇతర పోటీ దారులు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. డిజిటల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అలాగే టెలివిజన్ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేయడంతో అవి చర్చలకు కూడా దారి తీశాయి.

prakash raj whastapp chat with manchu vishnu before resignation

అయితే ప్రకాష్ రాజ్ రాజీనామా చేసే ముందు మంచు విష్ణుకి మెసేజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ ఈ విధంగా పేర్కొన్నారు. “డియర్ విష్ణు! నీ విజయానికి కంగ్రాచ్యులేషన్స్. మా బాధ్యతలు నిర్వహించేందుకు నీకు శక్తిని ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నేను మా మెంబర్‌షిప్ నుండి రాజీనామా చేయాలి అని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అంగీకరించు. నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా సరే నాన్ మెంబర్‌గా నీకు మద్దత్తు ఇస్తాను. థాంక్యూ. ప్రకాష్ రాజ్.”

prakash raj whastapp chat with manchu vishnu before resignation

ఈ మెసేజ్ కి మంచు విష్ణు ఈ విధంగా రిప్లై ఇచ్చారు. “డియర్ అంకుల్, థాంక్యూ. మీ నిర్ణయంతో నేను సంతోషంగా లేను. మీరు నాకంటే చాలా పెద్దవారు. గెలుపు ఓటములు అనేవి నాణానికి రెండు వైపులలాంటివి అని మీకు తెలుసు. రెండిటినీ మనం ఒకటేలాగా ట్రీట్ చేయాలి. ఎమోషనల్ గా ఆలోచించకండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా కుటుంబంలో మీరూ ఒక భాగం. మనం కలిసి పని చేయాలంటే నాకు మీ ఐడియాస్ అవసరం. ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వకండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని తొందరలోనే కలుస్తాను. మనం కలిసి మాట్లాడుకుందాం. ఐ లవ్ యు అంకుల్. దయచేసి తొందరపాటులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి” అని మంచు విష్ణు రిప్లై ఇచ్చారు.

You may also like