Ads
- చిత్రం : రంగమార్తాండ
- నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణన్.
- నిర్మాత : కలిపు మధు, ఎస్.వెంకట్ రెడ్డి
- దర్శకత్వం : కృష్ణ వంశీ
- సంగీతం : ఇళయరాజా
- విడుదల తేదీ : మార్చ్ 22, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా మొత్తం రాఘవ రావు (ప్రకాష్ రాజ్) అనే ఒక రంగస్థలం నటుడి చుట్టూ తిరుగుతుంది. రాఘవ రావు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. రాఘవరావు స్నేహితుడు చక్రపాణి బ్రహ్మానందం కూడా రంగస్థలం నటుడు. ఇద్దరూ కలిసి చాలా ప్రదర్శనలు ఇస్తారు. రాఘవ రావు పెద్దాయన అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని, తాను సంపాదించింది అంతా కూడా తన పిల్లలు అయిన శ్రీ (శివాత్మిక రాజశేఖర్), రంగ (ఆదర్శ్ బాలకృష్ణ) ఇచ్చేద్దాము అని నిర్ణయించుకుంటాడు.
అలా చేసిన తర్వాత తన పిల్లల ప్రవర్తనలో మార్పులు మొదలవుతాయి. రాఘవ రావుని, తన భార్య రాజు గారు (రమ్య కృష్ణన్) ని వారి పిల్లలు సరిగ్గా చూసుకోకుండా గొడవలు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇబ్బందుల నుండి ఎలా బయటపడ్డారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కుటుంబ కథా చిత్రాలు అంటే తెలుగులో గుర్తొచ్చే దర్శకులలో మొదటిలో ఉండే దర్శకుడు కృష్ణ వంశీ. తెలుగు ప్రేక్షకులకి ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు అందించారు. కేవలం కుటుంబ కథలు మాత్రమే కాకుండా, సందేశంతో ఉన్న ఎన్నో సినిమాలు కృష్ణ వంశీ చేశారు. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్. సినిమా అంతా కూడా ఒక రంగస్థలం నటుడి చుట్టూ తిరుగుతుంది.
ఒక నటుడు జీవితం ఎలా ఉంటుంది? వాళ్లు ఎదుర్కొనే సంఘటనలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమాలో ముఖ్య పాత్ర పోషించే నటులు బాగా చేస్తే ఆ పాత్ర ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గర అవుతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్, అలాగే మరొక పాత్రలో నటించిన బ్రహ్మానందం పాత్రలు ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి.
బ్రహ్మానందం అంటే సాధారణంగా మనకి కామెడీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ సినిమాలో చాలా ఎమోషనల్ పాత్రలో నటించారు. మిగిలిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించింది ప్రకాష్ రాజ్. అలాగే సినిమాకి మరొక హైలైట్ రమ్య కృష్ణన్ నటన. టైటిల్ కార్డ్ సమయంలో వచ్చే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా, అందులోనూ ముఖ్యంగా సంభాషణలు చాలా బలంగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- ఎమోషన్స్
మైనస్ పాయింట్స్:
- గుర్తుకు వచ్చే కొన్ని పాత సినిమాలు
- అక్కడక్కడ ల్యాగ్ అయిన కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశ పరచదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఎమోషనల్ సినిమాల్లో ఒక మంచి సినిమాగా రంగమార్తాండ సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article