Ads
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.మూడు నెలల నుండి దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి.కాగా ఇటీవల కాలంలో కొన్ని లాక్ డౌన్ రూల్స్ సడలించినప్పటికీ చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ జనరల్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేసారు.వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1 ,40 ,000 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.కాగా అందులో ఎక్కువ కేసులు అమెరికా లోనే నమోదు అయ్యాయి.అయితే కరోనా ఇంతలా విస్తృతంగా వ్యాపించడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల కరోనా కేసులు నమోదు కాగా సుమారు 4 లక్షలకు పైగా మరణించారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రధాన కార్యాలయం నుండి అధనామ్ మాట్లాడుతూ “కరోనా వైరస్ కి వాక్సిన్ కనిపెట్టడం చాలా కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు అని అన్నారు.అయితే వాక్సిన్ కనిపెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని అధనామ్ అన్నారు.అధికారులందరూ కరోనా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలని, సరైన నియమాలను పాటిస్తూ కరోనా వ్యాప్తి ని అరికట్టాలని అధనామ్ అన్నారు.లాక్ డౌన్ వలన ప్రజలు విసుగెత్తిపోయారని….దీంతో కరోనా మరింత విజృంభిస్తుంది అని… ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర దశలోకి అడుగుపెడుతోందని ఆయన హెచ్చరించారు.
End of Article