నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు,కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు A1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ A2గా ఉన్నారు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు.ఈ తరుణంలో ఆయన.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో నిన్న రాత్రి గదిని అద్దెకు తీసుకున్న మారితీరావు… ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యా? అనే కోనంలో పోలీసుల విచారణ జరగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ హత్య మనదేశం మొత్తం కలకలం రేపింది. ప్రణయ్, అమృత వర్షిణిల విషాద ప్రేమకథ ప్రతిష్టాత్మక వాషింగ్టన్ పోస్ట్ కధనాన్ని ప్రచురించింది. A young Indian couple married for love. Then the bride’s father hired assassins` అనే హెడ్ లైన్ తో ఈ వార్త వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ లో ప్రపంచానికి చాటారు.