ఇటీవల బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య, కన్నడ స్టార్ చిరంజీవి సర్జా హఠాన్మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది.. చిత్రపరిశ్రమకి చెందినవారు,కుటుంబ సభ్యులు,అభిమానులు అనేకమంది వారిని తలచుకుంటూ బాధపడుతూ,వారికి సంబంధించిన మెమోరీస్ ఇన్స్టా లో శేర్ చేస్కుంటున్నారు..నటి ప్రణీత మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించింది..

Video Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, చిరంజీవి సర్జా పేరిట నిరుపేదలకు నిత్యావసర సరుకులు దానం చేసింది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి అట్టడుగు వర్గాలకు  సాయం చేస్తూ తన పెద్ద మనసు చాటుకుంది చిన్న నటి ప్రణీత..ఎందరో స్టార్ హీరోయిన్లు కనీసం విరాళాలు ఇవ్వడానికి కూడా ముందుకు రాని పక్షంలో , ప్రణీత మాత్రం తానే ముందుంది సాయం చేస్తుంది..లాక్డౌన్ అయినప్పటి నుండి, ప్రణీత పేదవారికి సేవ చేస్తూ, వారికి సహాయం చేయడానికి తన వంతు కృషి చేస్తోంది. ఇప్పటివరకు వలసకార్మికులకు స్వయంగా ఆహారం అందించడం,పేదలకు సరుకుల పంఫిణి, 8లక్షలు కరోనా సహాయనిధి వసూలు చేయడం ఇప్పుడిలా నటుల పేరు మీద సరుకుల పంఫిణి…

ఇందుకు సంబంధించిన  ఫొటోలను తన ఇన్స్టా ఖాతాలో శేర్ చేసుకున్న ప్రణీత “చిరు, సుశాంత్ జ్ణాపకార్దం  150పైగా కుటుంబాలకు  నిత్యావసర సరుకులతో పాటు, శానీటరి నాప్కిన్స్ ని పంపిణి చేసాము.. సమాజంలోని అన్ని వర్గాలకు సేవచేయాలనే విషయంలో సుధామూర్తి తనకు ఇన్సిపిరేషన్ అని,ఆమె అడుగు జాడల్లోనే తను అట్టడుగు వర్గాలతో సహా, వర్కర్లకు సాయం చేయడానికి ముందుకు వచ్చానని తన పోస్టులో పేర్కొంది. .. ”

జన్మత: కన్నడ నటి అయిన ప్రణీత చిరంజీవి సర్జా తో మూడు సినిమాల్లో నటించింది..వృత్తి రిత్యా,పర్సనల్ గా కూడా చిరంజీవిసర్జా మరియు ఆ కుటుంబంతో ప్రణీతకు స్నేహం ఉంది.. ఆ స్నేహంతోనే ఇప్పుడు ఇలా చేసింది.. తన పెద్ద మనసుని చాటుకుంటున్న బాపుబొమ్మకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..లాక్ డౌన్ తో కష్టాలు పడుతున్న ప్రజలకు సాయం చేసిన నటుల్లో సోనూసూద్ రియల్ హీరో అయితే, ప్రణీత రియల్ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..