సలార్ కోసం “ప్రభాస్”కి… ప్రశాంత్ నీల్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..?

సలార్ కోసం “ప్రభాస్”కి… ప్రశాంత్ నీల్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..?

by Sunku Sravan

Ads

పాన్ ఇండియా లెవల్ లో సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నారు అదే సలార్..

Video Advertisement

ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. భారీ అంచనాల మద్య ఈ సినిమా హెవీ డ్యూటీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఒక రిక్వెస్ట్ చేశారట. అదేమిటో ఓ సారి చూద్దాం..! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోయే సలార్ మూవీ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అంతటి స్టార్ డైరెక్టర్, ఇంత స్టార్డమ్ ఉన్న హీరో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ కొన్ని నిబంధనలు పెట్టారట. సాహో, రాధేశ్యామ్ సినిమాల్లో ప్రభాస్ కాస్తా బరువు పెరిగినట్టు కనిపించడంతో దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని ప్రభాస్ ను కోరారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మంచి బాడీ ఆకృతి కోసం ప్రభాస్ కూడా కసరత్తులు మొదలు పెట్టారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ ను ఒక కొత్త లుక్ లో ప్రేక్షకుల అంచనాలకు అందని కొత్తదనంతో ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూవీ 2023 వేసవి కల్ల పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందని తెలుస్తోంది. అలాగే సినిమా రెండు భాగాలుగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

కానీ దాన్ని ఇప్పటివరకు మూవీ యూనిట్ ధృవీకరించలేదు.సలార్ చిత్రంలో ప్రభాస్, శృతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ నీ హోంబలే ఫిల్మ్ భారీ స్థాయిలో మన ముందుకు తీసుకురానుంది. మూవీ షూటింగ్ జూన్ లో ప్రారంభించనున్నారు.


End of Article

You may also like