సలార్ సినిమా కోసం డైరెక్టర్ “ప్రశాంత్ నీల్” తీసుకున్న “రెమ్యూనరేషన్” ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సలార్ సినిమా కోసం డైరెక్టర్ “ప్రశాంత్ నీల్” తీసుకున్న “రెమ్యూనరేషన్” ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika Singaluri

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎర్లీ మార్నింగ్ షో నుంచి కూడా ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.

Video Advertisement

దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ సలార్ సినిమాతో దక్కింది.

ఇక ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా చూపించాడు. ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా పడిందంటూ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలివేషన్స్ సీన్స్ లో ప్రభాస్ ఒక రేంజ్ లో కనిపించాడు.ఇదంతా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ పుణ్యమా అంటూ జరిగింది. ఇది వరకు కేజిఎఫ్ సిరీస్ కూడా ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ తో నింపేశారు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. అదే రేంజ్ లో ఇప్పుడు సలార్ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించారు.

is this is the prashantneel's multiverse concept..!!

సలార్ సినిమాలో ప్రభాస్ ను చూపించిన విధానానికి ప్రశాంత్ నీల్ కి దండ వేసి దణ్ణం పెట్టిన తప్పు లేదని ప్రభాస్ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. అయితే ప్రభాస్ ని ఈ రేంజ్ లో చూపించినందుకు ప్రశాంత్ నీల్ కి సలాడ్ సినిమాకి అందిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…? ప్రశాంత్ నీల్ కి రైటింగ్ కి డైరెక్షన్ కి కలిపి నిర్మాతలు 50 కోట్ల రూపాయలు ముట్ట చెప్పారట.ఈ రేంజ్ సినిమా తీసినందుకు అమ్రతం ఇవ్వచ్చు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


End of Article

You may also like