వీడు మాములు దొంగ కాదు..ప్రయాణికులతో సహా బస్సు దొంగిలించాడు..చివరకు ఏం చేశాడంటే..!

వీడు మాములు దొంగ కాదు..ప్రయాణికులతో సహా బస్సు దొంగిలించాడు..చివరకు ఏం చేశాడంటే..!

by Megha Varna

ఇది విచిత్రమైన ఘటన… ఈ చోరుడు మహా ఘనుడు. బస్టాండులో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సునే ఎత్తుకెళ్లాడు…పూర్తి వివరాల్లోకి  వెళ్తే తాండూర్ డిపోకు చెందిన బస్సు కరోన్ కోట్ నుంచి ఒగిపూర్ కు వెళ్తున్నది.   బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ నైట్‌హోల్డ్ బయల్దేరడానికి బస్టాప్‌లో నిలిపి ఉంది. డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు.

Video Advertisement

అప్పటికే ప్రయాణికులు బస్సులో ఎక్కి కూర్చున్నారు. అంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సును స్టార్ట్ చేశాడు.కండక్టర్ రాకుండానే బస్సును ఎలా స్టార్ట్ చేస్తావని ప్రయాణికులు ప్రశ్నించగా..దీనికి నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ మాట్లాడి.. బస్టాప్ నుంచి రయ్‌మంటూ తీసుకెళ్లాడు.ఆ వ్యక్తి తన చేరుకోవాల్సిన ప్రాంతంనికి రాగానే  బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో భయపడిన నిందితుడు బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.

ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న డిపో మేనేజర్ బస్సును తిరిగి డిపోకు తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదుతో.. సీసీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించామని పోలీసులు తెలిపారు. బస్సును దొంగతనంగా తీసుకెళ్లిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.


You may also like

Leave a Comment