సామాన్యులకు భారీ ఊరట.. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం!

సామాన్యులకు భారీ ఊరట.. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం!

by Harika

Ads

కరెంట్ బిల్లులు మోత మోగుతున్న ఈ కాలంలో ఉచితంగా కరెంటు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది. జీవితాంతం ఉచితంగా విద్యుత్ పొందేలా అద్భుతమైన స్కీం ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇండ్లకు ప్రతినెల 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసే సౌరఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు.

Video Advertisement

ఇళ్ల పైకప్పుల పై సోలార్ ప్యానల్స్ ని అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో 40% సబ్సిడీ ఇస్తే ఇప్పుడు దానిని 60 శాతానికి పెంచారు, మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు పీఎంఎస్ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలా చేయటం అనేది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.

నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు కంటే తక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్సన్ వెహికల్ ని రూపొందిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఎస్ పి వి లను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే 60% సబ్సిడీ కాకుండా మిగిలిన 40 శాతం ఎస్పీవీ నుంచి రుణంగా తీసుకోవచ్చు.గత నెలలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు.

ఫిబ్రవరి 1న లోక్ సభలో బడ్జెట్ ని సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా దీని గురించి మాట్లాడారు. బడ్జెట్లో పథకానికి పదివేల కోట్లు కేటాయించారు. దేశంలో సౌరశక్తితో 100 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో సౌరశక్తితో దాదాపు 35 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ పథకంలో ఉత్పత్తిదారులు ఖర్చు చేయగా మిగిలిన విద్యుత్ని ఎస్ పి వి కొనుగోలు చేస్తుంది.


End of Article

You may also like