గదిలో బంధించి వేధిస్తున్నారు …విదేశాలకు వెళ్లనివ్వండి అంటూ హీరోయిన్ లేఖ.!

గదిలో బంధించి వేధిస్తున్నారు …విదేశాలకు వెళ్లనివ్వండి అంటూ హీరోయిన్ లేఖ.!

by Megha Varna

Ads

బాలీవుడ్ నటి ప్రీతిజింటా,ప్రముఖ బిజినెస్ మాన్ నెస్ వాడియా మధ్య ప్రేమాయణం సినిమాని తలపించేలా జరిగింది .వీరిద్దరూ కలిసి ఐపీయల్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం ను కొనుగోలు చేసిన అనంతరం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే  వార్త అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .అంత బాగానే జరుగుతుంది అనే సమయంలో ఇద్దరికీ బ్రేక్ అప్ `అవ్వడం ..అది కాస్త పోలీస్ కేసులు దాకా వెళ్లడంతో ఈ సంఘటన సంచలనం అయింది.

Video Advertisement

ఈ సంఘటన పై ప్రీతిజింటా మాట్లాడుతూ…2014 మే 30 నా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన అనంతరం మా మధ్య కొన్ని గొడవలు నెలకొన్నాయి .ఆ మ్యాచ్ పూర్తి అయ్యాక నెస్ నా చేతిని పట్టుకుని దురుసుగా ప్రవర్తించాడని టీం సభ్యులందరు నెస్ ను తిట్టారని తెలిపింది ..

జట్టు ను మేనేజ్ చెయ్యడంలో మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి ..మా మధ్య అవగాహనా లోపించింది .ఈ నేపథ్యంలోనే స్టేడియంలో మా మధ్య గొడవ జరిగింది .ఆ సమయంలో అసభ్యమైన పదజాలంతో నన్ను తిట్టారు .నేను వాడియాను కంట్రోల్ లో ఉండమని నోరు అదుపులో పెట్టుకోమని  హెచ్చరించాను .అయితే తాను తన వైఖరిని మార్చుకోలేదు ..అది నన్ను ఎంతగానో బాధపెట్టింది అని ప్రీతిజింటా తన ఫిర్యాదులో వెల్లడించారు ..

అంతేకాకుండా నెస్ వాడియా నన్ను చంపుతానని ,కనపడకుండా చేస్తానని బెదిరించాడు ..అయన బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఎందుకులే ప్రశాంతంగా బతుకుదామని నెస్ వాడియాతో నా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాను ..కానీ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన సంఘటన నా జీవితానికి ప్రమాదంగా మారింది అని ప్రీతిజింటా తెలిపారు ..

నెస్ వాడియా తో వివాదం నేపథ్యంలో ముంబై పోలీస్ కమీషనర్ రాకేష్ మరియాకు లేఖ ద్వారా ఇలా తెలిపారు ..’నా ప్రాణాలకు ప్రమాదం ఉంది .ఆయన నాతో చాల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ,సిగరెట్లతో కలుస్తున్నాడు ,మానసికంగా వేధిస్తున్నాడు ,ఒక గదిలో బందించి హింసిస్తున్నాడు,దారుణంగా కొడుతున్నాడు ..ఇలాంటి పరిస్థితులలో నేను ఇక్కడ ఉండడం నాకు ఎంత మాత్రం మంచిది కాదు ..కావున నాకు విదేశాలు వెళ్ళడానికి అనుమతిని ఇప్పించండి అని కోరారు

నెస్ వాడియాకు దూరంగా ఉంటె నాకు ప్రశాంతగా ఉంటుంది అని పేర్కొన్నారు.కాగా తాను మాట్లాడిన మాటల్లో ఎటువంటి నిజం లేదు అని నెస్ వాడియా ఖండించారు …వీరిద్దరి మధ్య ఇలాంటి విభేదాల నేపథ్యంలో 2018 లో కోర్టు సూచన  మేరకు కోర్టు బయట వీరు వివాదానికి ముగింపు పలికారు ..ఆ వివాదం జరిగినప్పటి నుండి ఇప్పటివరకు  వారిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు సహా యాజమన్యులుగా కొనసాగటం విశేషం …


End of Article

You may also like