లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని బ్రేక్ పడడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న పలు కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.తాజాగా బాలీవుడ్ నటుడు మరియు హిందీ బుల్లితెర నటుడు అయినా మనమిత్ గ్రేవాల్ ఆత్మహత్య ఉదంతం మరవకముందే బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.బాలీవుడ్ టాప్ రేటింగ్ రియాలిటీ షో లకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రేక్ష మెహతా ఆత్మహత్య కు పాల్పడ్డారు.ఆ వివరాల్లోకి వెళ్తే..

ప్రేక్ష మెహతా అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు.కాగా పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ముందు దూసుకుపోతున్నారు.ప్రేక్ష మెహతా ను అభిమానించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే.అయితే తన నివాసం ఉంటున్న ఇండోర్ పట్టణంలో ఆత్మ హత్యకు పాల్పడ్డారు ప్రేక్ష మెహతా.సోమవారం రాత్రి తన బెడ్ రూంలో ఉరి వేసుకుని మృతి చెందారు ప్రేక్ష మెహతా.మంగళవారం ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ప్రేక్ష మెహతా తండ్రి తన గదిలోకి వెళ్లి పరిశీలించగా ప్రేక్ష మెహతా ఫ్యాన్ కు ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది.అయితే ప్రేక్ష మెహతా తాను చనిపోయే ముందు రోజు రాత్రి ఇంస్టాగ్రామ్ లో తాను కొన్ని విషయాలను పంచుకుంది కాగా ఆ పోస్ట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

“ఎప్పుడైతో నీ కలలు ముగుస్తాయో… అంతకంటే బాధాకరమైన విషయం జీవితంలో ఏమి ఉండదు” అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు ప్రేక్ష మెహతా.అంతే కాకుండా తన చివరి సెల్ఫీ ని అప్లోడ్ చేసి “అగర్ తుమ్ సాత్ హో” అంటూ రాసారు.అయితే లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఏమి లేకపోవడం వలన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడం వలెనే ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారని తన సన్నిహితులు వెల్లడించారు.అయితే ప్రేక్ష మెహతా ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ ప్రముఖులతో పాటు చాలామంది ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు.