చాలామంది సినిమా హీరోయిన్లకంటే…నటనలో ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఎన్నో రెట్లు బెటర్.!

చాలామంది సినిమా హీరోయిన్లకంటే…నటనలో ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఎన్నో రెట్లు బెటర్.!

by Mohana Priya

మామూలుగా మన భాషలోని సినిమాలు వేరే భాషలోకి, వేరే భాషలోని సినిమాలు మన భాషలోకి రీమేక్ అవుతూనే ఉంటాయి. అలా ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి. ఇదంతా మన అందరికీ తెలుసు. కానీ సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ కూడా రీమేక్ అవుతాయి. ఒక టైంలో డబ్బింగ్ సీరియల్స్ హవా నడిచింది.

Video Advertisement

prema entha madhuram fame anu sri

కానీ తర్వాత తర్వాత మెల్లగా డబ్బింగ్ సీరియల్స్ తగ్గించి ఒకవేళ కథ బాగుంటే అదే కథని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. దాంతో తెలుగు ప్రేక్షకులు రీమేక్ సీరియల్స్ ని కూడా ఎంతో ఆదరిస్తున్నారు. అలా మరాఠీ లో ప్రసారం అయిన తులా పహతే రే సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు.

prema entha madhuram fame anu sri

ఆ సీరియలే జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ప్రేమ ఎంత మధురం. ఈ సీరియల్ లో వచ్చే అను, ఆర్య వర్ధన్ పాత్రలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా చెప్పుకోవాల్సిన మరొక పాత్ర మీరా. మీరా పాత్ర పోషిస్తున్న నటి పేరు అను శ్రీ.

prema entha madhuram fame anu sri

కొన్ని నెలల క్రితం అను శ్రీ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అను శ్రీ అసలు పేరు అనూష. అను శ్రీ గుడివాడ కి చెందినవారు. అను శ్రీ స్వాతి చినుకులు సీరియల్ లో నటించారు. స్వాతి చినుకులు సీరియల్ లో మొదటిసారిగా నెగిటివ్ పాత్ర పోషించారట అను శ్రీ. అలాగే కుంకుమ పువ్వు సీరియల్ లో రేణుక పాత్రలో నటించారు.

prema entha madhuram fame anu sri

తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించారు. అను శ్రీ స్వాతి చినుకులు డైరెక్టర్ రాజుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మీరా పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనుశ్రీ. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో ఫిబ్రవరి 2వ తేదీన టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో అను శ్రీ నటించిన ఒక ఐదు నిమిషాల సీన్ లో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటూ ఎంతోమంది ప్రశంసించారు. అలా అను శ్రీ తన పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ తో సీరియల్ హిట్ అవడానికి ఒక ప్లస్ పాయింట్ గా నిలుస్తున్నారు.

prema entha madhuram fame anu sri

prema entha madhuram fame anu sri

 

watch video:

 


You may also like