Ads
ప్రేమ కోసం నిరీక్షించే వాళ్ళు ఉన్నారు.ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం అంటూ ఒంటరి అయిపోయిన భగ్న ప్రేమికులు కూడా ఉన్నారు .ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇచ్చేవారని చూసాం అలాగే ప్రాణాలు తీసేవారిని కూడా చూసాం.ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రేమ.నన్నుప్రేమించకపోతే చంపేస్తా అని బెదిరించి మరి ప్రేమను పొందాలనుకునే వాళ్ళు ఉన్నారు.ప్రేమించలేదని గొంతు కోసేవాళ్లను కూడా చూసాం.అయితే ఈ నేపథ్యంలో మచిలీపట్నం లో ఓ విషాదం చోటు చేసుకుంది.తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడడానికి అమ్మాయి వాళ్ళ అన్నయ్య అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం హత్య చేసాడు ఓ యువకుడు.వివరాల్లోకి వెళ్తే ….
Video Advertisement
సాక్షి కధనం ప్రకారం ….మచిలీపట్నం జెండా సెంటర్ కు చెందిన 21 యేళ్ళ యర్రంశెట్టి సాయి మరియు యాసిన్ అనే ఇద్దరు మంచి స్నేహితులు.యాసిన్ పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడు.కాగా తరచుగా సాయి కోసం యాసిన్ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు.ఈ నేపథ్యంలో సాయి చెల్లితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.దీంతో యాసిన్ ఎక్కువగా సాయి సోదరితో మాట్లాడడం బయటకు వెళ్లడం జరిగేవి.విషయం తెలిసిన సాయి నువ్వు ఇలా చేస్తే బాగోదు నువ్వు మా చెల్లితో తిరగడం మనుకోవాల్సిందిగా పలుసార్లు హెచ్చరించాడు.
దీంతో యాసిన్ కి తీవ్ర కోపం వచ్చింది.తన ప్రేయసి తో మాట్లాడడానికి సాయి అడ్డు వస్తున్నాడని ఎలా అయినా సాయి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు యాసిన్.దీంతో సాయి ని ఒక మందు పార్టీ కి ఆహ్వానించాడు యాసిన్.ఒక కాలేజీ వెనకాల సిట్టింగ్ ఏర్పాటు చేసాడు.పథకం ప్రకారం మందు తాగే గ్లాస్లో సైనైడ్ కలిపాడు.ఆ విషయం తెలియని సాయి దానిని తాగేశాడు.ఆ తరువాత యాసిన్ మెల్లగా అక్కడ నుండి జారుకున్నాడు.సాయి కిందపడి అపస్మారక స్థితికి చేరుకొని ఉండగా అక్కడే ఉన్న స్థానికులు గమినించి ఎండా దాడి వలన ఇలా పడిపోయాడు అనుకోని ఆసుపత్రికి తరలిద్దాం అని సాయిని తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో సాయి మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి కి తరలించారు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
source: sakshi
End of Article