Ads
ప్రతి పది మందిలో ఒకడి లైఫ్ లో లవ్ స్టోరీ ఉంటుంది.ప్రతి వంద మందిలో ఒకడు ప్రేమించిన అమ్మాయికి లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు…ప్రతి వెయ్యి మందిలో ఒకడికి అమ్మాయి లవ్ ని ఆక్సెప్ట్ చేస్తుంది… కానీ లక్షలో ఒకడు మాత్రమే ప్రేమను పెళ్లి పీటల దాకా తీస్కెళ్ళగలుగుతాడు …ప్రేమించడం అంటే ప్రేమను పంచడం మాత్రమే …ప్రేమను తిరిగి ఆశించడం కాదు … ప్రేమ గురించి ఈ రేంజ్ లో పొయెట్రి చెప్పింది ప్రేమలో పడ్డ ఒక యువకుడు …మరి అతని కథ, ప్రేమను అమ్మాయికి వ్యక్త పరిచడం వరకే వెళ్ళిందా లేక పెళ్లి పీటల దాకావెళ్ళిందా అనేది అతని మాటల్లో వింటేనే బాగుంటుంది…
Video Advertisement
నా పేరు సూర్యకాంత్.అందరు సూర్య అని పిలుస్తుంటారు .హైదరాబాద్ లో ఎన్నో మిడిల్క్లాస్ ఫ్యామిలీస్ లో మాది ఒకటి.ప్రేమ గురించి నేను చెప్పడానికి కారణం నేనొక అమ్మాయిని ప్రేమించడం.అయిదేళ్ళ క్రితం మా ఇంటి బాల్కనీ లో ఈ కథ మొదలైంది .ఆ రోజే మొట్టమొదటి సారిగా నా కలల యువరాని దర్శనమిచ్చింది .రేపు నా బీ .టెక్ కాలేజ్ స్టార్ట్ అని కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ నేను బాల్కనీ లో తిరుగుతూ ఉండగా మా ఇంటి ముందు నుండి వెళుతున్న ఒక అమ్మాయిని చూశాను.
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు .కనీసం తన పేరు ఏంటో కూడా తెలీదు .తర్వాత షాపింగ్ కోసం అని బయటకి వెళ్ళాను.అక్కడ షాపింగ్ మాల్ మెట్ల మీద నుండి దిగి వస్తు అదే అమ్మాయి మళ్లీ కనిపించింది .ఎగసి పడే అల నేనైతే నాకోసం దిగి వస్తున్న ఆకాశం లాగా కనిపించింది నాకు.ఆ క్షణం నేను దేవుడిని కోరుకుంది ఒక్కటే, ఈ అమ్మాయిని మళ్లీ నాకు కనిపించేలా మాత్రం చేయకు .ఎందుకంటే లవ్ కి, లవ్ స్టోరీస్ కి నేను చాలా దూరంగా ఉంటా…కానీ తనని చూస్తే మాత్రం ఎందుకు ప్రేమించానో తెలియకుండా ప్రేమించేయాలి అనిపిస్తుంది.రేపు కాలేజ్ ఫర్స్ట్ డే అనే ఎక్సయిట్మెంట్ కంటే ఎక్కువగా నా ఊహల్లో అమ్మాయి నిండిపోయింది.
మరుసటి రోజు కాలేజ్ కి వెళ్ళా .నా అదృష్టం బాగుందని చెప్పాలో లేక దేవుడు కరుణించాడని చెప్పాలో తెలీదు.నిన్న కలలోకి మాత్రమే పరిమితం అనుకున్న అమ్మాయి మరొకసారి కనులకు ఎదురుగా కనిపించింది. అమ్మాయిలతో మాట్లాడడం అలవాటు లేని నేను ఆ అమ్మాయి మాట్లాడాలని కూడా ఆలోచించలేదు .కానీ ఎందుకో తన గురించి తెలుసుకోవాలి, కనీసం తన పేరు అయినా తెలుసుకోవాలి అని అనిపించింది .ఈ లోపే క్లాస్ కివచ్చిన లెక్చరర్ ఆ అమ్మాయిని క్లాస్ కి పరిచయం చేసుకో అనడం తో “నా పేరు శశిరేఖ “అని చెప్పింది .
సూర్య , శశి రెండు పేరులకి బిన్నత్వము ఎక్కువ అయినప్పటికీ రెండు ఒకే ఆకాశం నీడలో ఉంటాయి.నా ప్రేమ కూడా అదే ఆకాశం లాంటిది అని అనిపించింది .అదే రోజు సాయంత్రం ఇంటికి వెళుతుండగా ఒక ఇంటి ముందు శశి స్కూటీ కనిపించింది. అప్పుడే తెలిసింది అదే శశి వాళ్ళ ఇల్లు అని.అమ్మాయి మామూలుగా ఉంటేనే అబ్బాయిల ఫాలోయింగ్ని ఆపలేము .అలాంటిది ఏంజల్ లాగా ఉన్న శశి ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.ఆధార్ కార్డ్ లో లేని డీటేల్స్ కూడా ఈజీగా కలెక్ట్ చేసేస్తారు .శశి వాళ్ళ ఫాదర్ కి రీసెంట్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది.అందుకే ఈ ఇంట్లో కొత్తగా అద్దెకుదిగారు అని నా ఫ్రెండ్ చెపితే తెలుసుకున్నాను .
చదవడం కంటే ఎక్కువగా తన ఊహలతోనే కాలం గడిపేస్తు మౌనంగా ప్రేమించేస్తూ ఉండగానే సెమిస్టర్ ఎగ్స్యామ్స్ కూడా వచ్చేసాయి. ఎగ్స్యామ్స్ అయిపోయాక హాలిడేస్ లో శశివాళ్ళ అమమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అని తెలిసింది .తనని చూడకుండా ఉండగలనా లేదా అనే బయం వేసింది నాకు.కాటుక దిద్దిన రాతిరిలో ప్రయాణం లాగా అనిపించింది నా జీవితం శశి కనిపించని కొన్ని రోజులు. క్షణం ఒక యుగం లాగా గడిచింది.
బాద అయినా సంతోషమైనా కొంత కాలమే ఉంటుంది కదా.ఈ లోపు శశి ఊరి నుండి వచ్చేసింది.కాలేజ్ రి ఓపెన్ అయ్యింది .చాలా రోజుల తరవాత శశి ని చూసాను .బహుశా చాలా రోజులకీ చూడటం వల్లనో తెలీదు కానీ ఇంతక ముందు కంటే ఎంతో చూడ చక్కగాకనిపించింది .అదే రోజు వర్షం పడటం, తను నాకు ఇష్టమయిన వైట్ డ్రెస్ వేసుకోడం, కుడిచేయితో తన కంటిపై పడుతున్న కురులని సదురుకుంటూ ఉంటే చూడటం వల్ల తన అందం మరింతగా పెరిగింది ఏమో అని అనిపించింది .
ఇది ఆకర్షణ అని నాకు తెలుసు .కానీ ప్రేమకి మొదటి పునాది ఆకర్షణనే కదా .మౌనంగా ఎంత ప్రేమించావు అనే దానికంటే అమ్మాయికి ఎక్స్ ప్రెస్ చేయడం ముఖ్యం అని నా స్నేహితులు చెప్పే సరికి ధైర్యం చేసి తనకి నా ప్రేమ విషయం చెప్పేసా. కాకపోతే అందరి అబ్బాయిల లాగానే ప్రేమించిన అమ్మాయితో భయపడుతు, తడబడుతు ప్రేమ విషయంచెప్పా.
తను ఏం చెప్పకుండా వెళ్లిపోయింది .అంతేలే అప్పటి వరకు మాట్లాడని నేనుసడన్ గా వెళ్లి ఐ లవ్ యూ అని చెపితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది కదా . కాలంకి వేగం ఎక్కువ .కన్నీటికి కాలం కంటే వేగం ఎక్కువ .బాదకి దగ్గర బంధువు ని అయిపోయా .ఈ లోపే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ బిజీ స్టార్ట్ అయ్యింది.శశి కి ఒక టాప్ ఎం.ఎం.సి లో జాబ్ వచ్చింది .నాకు స్టార్ట్ అప్ కంపనీలో జాబ్ వచ్చింది .చిత్రమో లేక ఎదకి చైత్రమో తెలీదు కానీ ఫేర్ వెల్ రోజున శశి “ ఐ టూ లవ్ యూ“ అని చెప్పింది .
ఇన్ని రోజులు స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని నీ లవ్ ఆక్సెప్ట్ చేయలేదు అని చెప్పింది.లవ్ అనేది ఒక ఫీలింగ్ .అది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలీదు .తను నా లవ్ యాక్సెప్ట్ చేయగానే ఈ వరల్డ్ లో నేనే అందరికంటె లక్కీఎస్ట్, హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకున్నా .ఎగ్స్యామ్స్ అయిపోయాయి .కాలేజ్ కి వీడుకోలు చెప్పేసిన తరవాత జాబ్ ఆఫర్ లెటర్ రావడానికి టైమ్ పట్టింది.
నాకు హైదరాబాద్ లో పోస్టింగ్ వచ్చింది అని అదృష్టంగా భావించాలో లేక శశికి బెంగళూరులో పోస్టింగ్ వచ్చిందని దురదృష్టంగా భావించాలో అర్థం కాలేదు.మా ప్రేమవిషయం ఇద్దరి ఇంట్లో చెప్పాము .మా ఇద్దరి పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకున్నారు .ఇకజీవితం లో నేను సాధించడానికి ఇంకేం లేదు అనుకున్నా .జాబ్ లో జాయిన్ అయ్యేందుకు బెంగళూరు వెళుతున్న శశికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్ కి వెల్లా.తను నన్నుచివరి సారిగా చూసిన చూపు ఇప్పటికీ మరచిపోలేను. అంతకు ముందు ఎన్నో సార్లు కలిసినా…దూరంగా వెళ్ళేటప్పుడు చివరిసారిగా చూసే చూపు చాలా స్పెషల్ గా ఉంటుంది.
ప్రేమ మాటల్లో కంటే కంటి చూపులో ఎక్కువ కనబడుతుంది .ప్రేమకి మౌన భావాలే ఎక్కువ కదా.ఈ లోగా రైలు కదిలింది .నా మనసు నా నుండి దూరంగా వెళుతునట్టు అనిపించింది .నేను కూడా జాబ్ లో జాయిన్ అయ్యాను.పగలంతా ఆఫీస్ పని, రాత్రి అయితే శశి తో వాట్స్ యాప్ చాటింగ్.మనుషులు మాత్రమే దూరంగా ఉన్నాము మనసులు మాత్రం దగ్గరే ఉన్నాయి.దూరం మమ్మల్ని ఇంకా దగ్గర చేస్తూనే ఉంది.ఇలా రోజు ఫోన్ లో మాట్లాడడం చాట్ చేసుకోవడంతో రెండు సంవత్సరాలు గడిచిపోయింది.
మా పేరెంట్స్ మాపెళ్ళికి ఒప్పుకున్నారు కాబట్టి మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది .ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మూడునెలలు గడువు ఉండటం తో తను మళ్లీ బెంగళూరు వెళ్లిపోయింది . ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి జరగడం కంటే సంతోషం ఇంకేం ఉంటుంది .ఒక మనిషి సంతోషంగా ఎక్కువ రోజులు ఉంటే కాలం ఒరవలేదు అనుకుంటా.అందుకే ఏదో ఒక రూపంలో కష్టాలని అప్పు చేసి మరీ తీసుకువస్తుంది .
పెళ్లి పత్రిక డిజైన్ ఫైనల్ చేయడం కోసం కాల్ చేస్తే శశికాల్ లిఫ్ట్ చేయలేదు.తరవాత నుండి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది .ఏమైందో తెలీదు.నమ్మలేని ఓ చేదు నిజం నాకు ఎదురైంది .శశి సూసైడ్ చేసుకుంది అనే షాకింగ్ న్యూస్ తెలిసింది .నా ప్రేమ పెళ్లి పత్రికల నుండి పెళ్లి పీటల దాకా వెళ్లలేకపోయింది .ఏడు సంవత్సరాల ప్రేమ ఏడు అడుగులు వేయలేకపోయింది .సూర్య అని పేరు మాత్రమే ఉంది, వేకువ మాత్రం నాకు లేకుండా నిషి రాతిరిలోకి తోసి ఒంటరిగా నను శశి వదిలి వెళ్లిపోయిదీ .తను ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవ్వరికి తెలీదు .నా లోకమంతా శోకసంద్రమయ్యింది .కానీ నా వల్ల ఇంట్లో వాళ్ళు బాధ పడకూడదని బాదని నాలోనే దాచుకుని కన్నీళ్ళ రూపంలో నా కనుల నిండా శశి రూపం నింపుకున్నా .
ఇప్పటికీ నేను తననిప్రేమిస్తూనే ఉన్నా.ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడమే కదా.ఇవ్వడం లోనే ఎంతో సంతోషం ఉంది.తన ప్రేమ పొందాలని ఆశించడం నా మూర్కత్వం కదా.అందుకే అమాయకంగా తన ఊహలతో కాలం గడిపేస్తున్నా .అయినా నేను చాలా సంతోషంగా ఉన్నా .ఇది అర్థం కావాలి అంటే మీ లైఫ్ లో కూడా లవ్ కి చోటు ఉండి ఉండాలి .
– A Story Written By Sainath Gopi
Follow on instagram: instagram.com/sainath_gopi
మీరు రాసిన కథలు మాకు పంపాలనుకుంటే teluguaddanews@gmail.com కి మెయిల్ చేయండి.
షరతులు:
మీరు పంపించే కథ ఏ ఇతర వెబ్సైట్ లేదా న్యూస్ పేపర్ / Magzaine లో ప్రచురితమై ఉండకూడదు. మరియు మీరు పంపించే కథ పూర్తిగా మీరు సొంతంగా రాసినదై ఉండాలి.
End of Article