Ads
కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరీయల్ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.
Video Advertisement
ఈ సీరియల్ క్రేజ్ సోషల్ మీడియా వరకు పాకి ఇప్పటికే మీమ్స్ వస్తున్నాయి. ఈరోజు నుండి ఐపీఎల్ మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ మ్యాచ్ మొదలయ్యే టైం 7 :30 . స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం కూడా అదే. దాంతో చాలామంది ఇళ్లల్లో టైమింగ్స్ క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అందుకే సోషల్ మీడియాలో సూర్యా పేటకు చెందిన శివ చరణ్ అనే ఒక వ్యక్తి వాళ్లింట్లో ఒకటే టీవీ ఉంది అని, వాళ్ళ కుటుంబం 7:30 కి కార్తీకదీపం సీరియల్ చూస్తారని, అందుకే ఐపీఎల్ మ్యాచ్ టైమింగ్స్ మార్చమని మా టీవీ యాజమాన్యాన్ని కోరారు. శివ చరణ్ సిన్సియర్ గా అడిగినా కానీ వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి కాబట్టి మా టీవీ యాజమాన్యం కూడా ఐపీఎల్ టైమింగ్స్ మార్చలేక పోయారు. బహుశా బిసిసిఐ వాళ్ళకి కార్తీకదీపం క్రేజ్ తెలియదేమో. తెలిస్తే టైమింగ్స్ మార్చే వాళ్ళు.
బిసిసిఐ వాళ్లకేమో కానీ ఈ విషయం కార్తీక దీపం హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ దృష్టిలో పడింది. తనని, ఇంకా కార్తీకదీపం సీరియల్ ని ప్రేక్షకులు ఇంతగా అభిమానిస్తున్నారు అని తెలుసుకున్న ప్రేమి విశ్వనాథ్, శివ చరణ్ వాళ్ల ఇంటికి ఒక 32 ఇంచెస్ టీవీ ని పంపించారట. దీంతో ఆన్ స్క్రీన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ ద్వారా కూడా అభిమానులకి ఇంకా చేరువయ్యారు ప్రేమి విశ్వనాథ్.
End of Article