వంటలక్క ఫాన్స్ కి సూపర్ న్యూస్…ఫస్ట్ ఆడిషన్ కి వెళ్తే చీపురు ఇచ్చారంట, ఇప్పుడు లేడీ పోలీస్ గా.!

వంటలక్క ఫాన్స్ కి సూపర్ న్యూస్…ఫస్ట్ ఆడిషన్ కి వెళ్తే చీపురు ఇచ్చారంట, ఇప్పుడు లేడీ పోలీస్ గా.!

by Mohana Priya

Ads

ప్రేమి విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం “దీప” ఎక్కువగా ఇంటర్వ్యూ లు ఇవ్వరు. తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా లేదా న్యూస్ మీడియా ద్వారా తెలుసుకున్నదే కానీ ప్రేమి విశ్వనాథ్ అయితే తన గురించి ఎక్కడా చెప్పలేదు. ఇటీవల దసరా సందర్బంగా సాక్షి టీవీ తో మాట్లాడారు ప్రేమి విశ్వనాథ్. ఈ ప్రోగ్రాం కి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ప్రోగ్రాం పేరు సుమ దీపం.

Video Advertisement

ఈ ప్రోగ్రాం లో తను అసలు ఈ రంగం లోకి ఎలా అడుగుపెట్టారో, తన జర్నీ ఎలా ఉందో చెప్పారు ప్రేమి విశ్వనాథ్. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. కార్తీక దీపం సీరియల్ లో నటించడం తో పాటు వాళ్ళ స్టూడియోస్ కూడా మేనేజ్ చేస్తారట ప్రేమి విశ్వనాథ్. ఒక సారి వాళ్ళ అన్నయ్య ఒక కెమెరా తీసుకున్నారు అని, ఆ రోజు తను చీర లో రెడీ అయ్యి ఉంటే ఒక ఫోటో తీశారు అని, అదే ఫోటో చూసి కరుత ముత్తు కి తీసుకున్నారు అని చెప్పారు.

ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒకాయన కరుత ముత్తు ఆడిషన్స్ గురించి చెప్పి, చాలా మంది ఫెయిర్ గా ఉన్న అమ్మాయిలకి డార్క్ స్కిన్ టోన్ వచ్చేలాగా మేకప్ చేశారు. అయినా పాత్ర కి ఎవరు సెట్ అవ్వట్లేదు. నువ్వు వెళ్ళు అని సలహా ఇచ్చారు. దాంతో ప్రేమి ఆడిషన్స్ కి అటెండ్ అయ్యారు.

premi vishwanath in karutha muthu

ఆడిషన్ లో తనకి ఒక చీపురు ఇచ్చారట. ఇంట్లో చేస్తారు కాబట్టి ప్రేమి కూడా క్లీనింగ్ చేశారు. తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో తనకి చీర కట్టించారట. ఒక ఏడుపు సీన్ ఇచ్చారు. ఆ సీన్ లో గుడికి వెళ్తుంటే గొడుగుతో తమకి అడ్డుగా ఉందని ప్రేమి పాత్ర ని తిడతారు. ఆ తిట్లు విని ప్రేమి నిజంగానే ఏడ్చారట. ఆలా సీరియల్ లో సెలెక్ట్ అయ్యారు ప్రేమి విశ్వనాథ్.

అంతేకాకుండా ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. తెలుగులో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రేమి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.సినిమా కరోనా కారణంగా ఆగిపోయిందట. కానీ ఇప్పుడు ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు ప్రేమి విశ్వనాధ్.


End of Article

You may also like