10 టీవీ కథనం ప్రకారం….ప్రేమించిన ప్రియడు బాగా బిజీగా ఉండడటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది ప్రియురాలు .కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు అనుకున్న సమయానికి రాలేక పోయాడు..దీంతో మనసు గాయపడిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకొంది.తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య (22 ) రైల్వే కానిస్టేబుల్ గా పనిచేస్తూ పెరుంబుర్ రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటుంది .

Video Advertisement

ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ఆమెకు చెన్నైలోని ఎస్పాలనెడు పోలీస్ స్టేషన్లో డ్యూటీ విధించారు.శరణ్యకు కొన్ని నెలల క్రితం ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ కు చెందిన ఎలుమలై అనే కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడి క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.గురువారం ఏప్రిల్ 30 ఎలుమలై బర్త్ డే కావడంతో శరణ్య తన డ్యూటీని త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్లి ఎలుమలై పుట్టిన రోజు వేడుకలు సిద్ధం చేసింది.

అయితే ఎలుమలైకి పేదలకు ఆహారం అందచేసే ప్రదేశంలో సెక్యూరిటీ డ్యూటీ కేటాయించారు.ఆ కారణంగా శరణ్య చెప్పిన సమయానికి ఎలుమలై రాలేకపోయాడు.తన డ్యూటీ అయిపోయిన అనంతరం శరణ్య కు జరిగిన విషయం చెపుదాం అని కాల్ చేస్తే శరణ్య కాల్ కి స్పందించలేదు .ఎన్ని సార్లు చేసిన రెస్పాన్స్ రాకపోవడంతో అదే క్వార్టర్స్ లో ఉంటున్న ఆమె స్నేహితురాలు రాజేశ్వరికి కాల్ చేసి శరణ్య ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఎలుమలై .శరణ్య ఇంటికి వచ్చిన రాజేశ్వరి షాక్ కు గురయ్యింది.

అయితే రాజేశ్వరి చూసే సమయానికి శరణ్య ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది.దీంతో రాజేశ్వరి వెంటనే ఒట్టేరి పోలీసులకు సమాచారం తెలియచేసింది.ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి ,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెయ్యడం మొదలుపెట్టారు.తాను ఎంతగానో ప్రేమించిన శరణ్య ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఎలుమలై కన్నీటి పర్యంతం అవుతున్నారు.అనుకోకుండా విధించిన డ్యూటీ వలన రాలేకపోయాను తప్పితే కావాలని కాదు అయినా ఈ విషయం ని మనసును ఇంత బాధించిందా  అంటూ ఎలుమలై శోకసంద్రంలో మునిగిపోయారు .

source: 10tv