మరోసారి చైనా ని టార్గెట్ చేసిన ట్రాంప్ ..కరోనా కాదు,అది చైనా వైరస్..కారణమదే (వీడియో )

మరోసారి చైనా ని టార్గెట్ చేసిన ట్రాంప్ ..కరోనా కాదు,అది చైనా వైరస్..కారణమదే (వీడియో )

by Megha Varna

Ads

కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సారి  మీడియా సమావేశంలో చైనా వైరస్ అని పలికారు,ఒక మీడియా అధికారి మీరు ఎందుకు చైనీస్ వైరస్ అంటున్నారు అని ప్రశ్నించగా , చైనాలో పుట్టిన వైరస్ కాబట్టే దీన్ని చైనీస్ వైరస్ అంటున్నామని  చెప్పారు,  చైనా వైరస్ అని అనడం వల్ల అమెరికాలో ఉన్న చైనా అమెరికన్లు వివక్షకు గురవుతున్నారంటూ మీడియా సభ్యులు ట్రంప్‌తో అన్నారు.ఇది జాత్యహంకారం కాదంటూ సమాధానమిచ్చారు.ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.వైరస్‌ ప్రపంచం మొత్తం చెందకుండా వ్యాప్తి ఆ దేశం ముందే అప్రమత్తం చేయడంలో ఆ దేశం విఫలమైందంటూ మండిపడ్డారు. చైనా చేసిన తప్పుకు కి ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది  విమర్శలు గుప్పించారు.గతంలో కరోనా వైరస్ అమెరికా సైనికుల నుంచే వ్యాపించిందంటూ చైనా పలు తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు ట్రంప్ గుర్తుచేశారు.

Video Advertisement

ఇటలీ తర్వాత ఇప్పుడు అమెరికా అల్లకల్లోలం అవుతుంది ,రోజు రోజుకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి, అమెరికాలో నిన్న ఒక్కరోజే 223 మంది మృతి చెందగా, 11 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాలు 1000కి చేరాయి.ఇది ఇలా ఉండగా ట్రంప్ తమ దేశ పౌరులకు ఆర్థిక సహాయం చేయనుంది ,ఆ దేశంలోని , పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్లు , 75 వేల డాలర్లలోపు ఆదాయం ఉన్న వారందరి 1,200 డాలర్లు ఇవ్వాలి అని నిర్ణయించుకుంది.


End of Article

You may also like