THE GOAT LIFE REVIEW : “పృథ్వీరాజ్ సుకుమారన్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

THE GOAT LIFE REVIEW : “పృథ్వీరాజ్ సుకుమారన్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

మలయాళం సినిమాలతో, ఇప్పుడు సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆ సినిమా ది గోట్ లైఫ్. ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ది గోట్ లైఫ్ – ఆడు జీవితం
  • నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్.
  • నిర్మాత : బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్, కె.జి. అబ్రహం
  • దర్శకత్వం : బ్లెస్సీ
  • సంగీతం : A. R. రెహమాన్
  • విడుదల తేదీ : మార్చి 28, 2024

he goat life aadu jeevitham movie review

స్టోరీ :

నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్), అతని భార్య సైను (అమలా పాల్) కలిసి ఆనందంగా బతుకుతూ ఉంటారు. అయితే, డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో దుబాయ్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు నజీబ్. తన స్నేహితుడు, హకీమ్ (కెఆర్ గోకుల్) తో కలిసి ముందు సౌదీ అరేబియాకి వెళ్తాడు. దొంగ వీసా మీద నజీబ్ అక్కడికి వెళ్తాడు. అలా వాళ్ళు దుబాయ్ వరకు చేరుకుంటారు. వాళ్లకి హిందీ రాదు. అలా అని ఇంగ్లీష్ కూడా రాదు. దాంతో ఎయిర్ పోర్ట్ లో చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ స్పాన్సర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఖఫీల్ (తాలిబ్ అల్ బలూషి) వీళ్ళ పరిస్థితిని గమనిస్తాడు.

అమాయకంగా ఉన్నారు అని, వీళ్ళని మోసం చేయడం చాలా సులభమైన విషయం అని అనుకుంటాడు. వాళ్ళిద్దరిని తనతో పాటు తీసుకెళ్తాడు. హకీమ్ ని నజీబ్ నుండి విడదీస్తాడు. నజీబ్ ని ఒక ఎడారిలో గొర్రెలు కాయడానికి వదిలేస్తాడు. అప్పుడు నజీబ్ ఏం చేశాడు? ఎడారి నుండి ఎలా తప్పించుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? నజీబ్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా అన్న తర్వాత చాలా మంది చాలా కాలం పాటు కష్టపడతారు. ఆ కష్టాన్ని 3 గంటల రూపంలో మనకి చూపిస్తారు. సినిమాల కోసం సంవత్సరాలు కష్టపడడం అనేది కొత్త ఏమీ కాదు. కానీ అన్ని సంవత్సరాలు కష్టపడటం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో ఓపిక ఉండాలి. ప్రేక్షకులకి ఒక 3 గంటల సినిమాని అందించడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు అంటే వాళ్లకి సినిమా పట్ల ఉన్న తపన ఏంటో అనేది అర్థం అవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు బ్లేస్సీతో కలిసి పృథ్వీరాజ్ దాదాపు 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. మరొక పక్క ఇంకా కొన్ని ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు.

అలా ఇన్ని సంవత్సరాలు ఒక స్టార్ హీరో పనిచేయడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమాలో చాలా వరకు ఎమోషనల్ గా సీన్స్ ఎక్కువగా ఉండేలాగా రాసుకున్నారు. డబ్బు సంపాదించాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. కొంత మంది మామూలుగా ఉన్నా కూడా, చుట్టూ ఉన్నవారు వారిని పనికిరాని వారు అని అనుకునే లాగా చేసి, వాళ్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్తారు. అలాంటి సమయంలో ఇవన్నీ పడలేక డబ్బు సంపాదించాలి అని అనుకున్న వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడతాడు.

డబ్బు సంపాదిస్తే చాలా సమస్యలు తీరిపోతాయి అని, కష్టపడాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఎంతో మంది వస్తారు. కానీ వాళ్లలో కొంత మంది అమాయకులు కూడా ఉంటారు. కొంత మంది ఈ విషయాన్ని ఉపయోగించుకొని ఈ అమాయకులని ఇబ్బంది పెడతారు. ఈ సినిమాలో కూడా ఇప్పుడు ఇలాంటి ఒక కథను చూపించారు. పృథ్వీరాజ్ పాత్ర ఎదుర్కొన్న సంఘటనలు చూస్తూ ఉంటే ప్రేక్షకుడికి కంటతడి తెప్పించే విధంగా ఉంటాయి. అన్ని సంవత్సరాలు ఒక మంచి ఉద్దేశంతో వెళ్లిన వ్యక్తికి అలాంటి సంఘటనలు జరిగాయి అంటే బాధాకరంగా అనిపిస్తుంది.

the goat life aadu jeevitham movie review

దర్శకుడు బ్లేస్సి రాసుకున్న సీన్స్ చాలా బాగున్నాయి. చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. సినిమాకి పృథ్వీరాజ్ చాలా పెద్ద హైలైట్. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయడం మాత్రమే కాకుండా, సంవత్సరాల తరబడి తాను అక్కడ చిక్కుకుపోయి ఉన్నప్పుడు ఆ పాత్రలో ఉండే వ్యత్యాసాన్ని కూడా చాలా బాగా తెర మీద చూపించారు. యంగ్ పాత్రలో, మధ్య వయసు ఉన్న వ్యక్తి పాత్రలో, కాస్త పెద్దవాడిగా, వృద్ధాప్యానికి చేరువలో ఉన్న పాత్రలో చాలా బాగా నటించారు.

the goat life aadu jeevitham movie review

మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. హీరోయిన్ అమలా పాల్ తనకు ఇచ్చిన పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాకి మరొక హైలైట్ ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం. సునీల్ కె ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండే అంత బాగా చూపించారు.

కానీ, సినిమా ఎడిటింగ్ విషయంలో ఇంకా కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. దాంతో కొన్ని చోట్ల బోరింగ్ అనిపించే అవకాశం ఉంది. ఎడిటింగ్ ఇంకా కొంచెం షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. లేదా, ఆ సీన్స్ అంత వివరంగా చూపించాలి అని సినిమా బృందం అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • పృథ్వీరాజ్ నటన
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే ఈ సినిమా నిజాయితీతో చేసిన ఒక గొప్ప ప్రయత్నం. అందరూ తప్పకుండా చూడవలసిన ఒక సినిమా. ఇలాంటి ప్రయత్నానికి సినిమా బృందాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇటీవల కాలంలో వచ్చిన ఒక గొప్ప ప్రయత్నంగా ది గోట్ లైఫ్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “గుంటూరు కారం” సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టే… గేమ్ ఛేంజర్ సినిమాలో “రామ్ చరణ్” చేశారుగా..? విషయం ఏంటంటే..?


End of Article

You may also like