Ads
- చిత్రం : బలగం
- నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి.
- నిర్మాత : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
- దర్శకత్వం : వేణు యేల్దండి (టిల్లు వేణు)
- సంగీతం : భీమ్స్ సిసిరోలియో
- విడుదల తేదీ : మార్చ్ 3, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా అంతా తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. సాయిలు (ప్రియదర్శి) ఒక నిరుద్యోగి. ఉపాధి కోసం ఎన్నో రకాల పనులు చేస్తాడులే కానీ, ఏ ఒక్క పని డబ్బులు తెచ్చి పెట్టదు. దాంతో ఊరిలో స్నూకర్ బోర్డ్ పెడతాడు. బాగా అప్పల పాలు కావడంతో పెళ్లి చేసుకొని, దాంతో వచ్చే డబ్బులతో అప్పులు తీర్చాలి అని అనుకుంటాడు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు తన తాత చనిపోతాడు. దాంతో కొన్ని గొడవల వల్ల నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్లి కూడా ఆగిపోతుంది.
అంతే కాకుండా తన అత్తతో కూడా సాయిలు కుటుంబానికి గొడవలు ఉంటాయి. తన మామయ్యకి ఆస్తి బాగా ఉంది అని తెలిసిన సాయిలు, మరదలు అయిన సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) ని ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నాలు అన్ని ఫలించాయా? సాయిలు అప్పులు తీరాయా? తాత మరణం తర్వాత సాయిలు, కుటుంబం ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన కుటుంబంలో ఉన్న గొడవలని పరిష్కరించాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమాల్లో నటించే ఎంతో మంది తర్వాత దర్శకత్వం బాట పట్టారు. ఇప్పుడు అలా కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టిల్లు వేణు కూడా దర్శకుడిగా బలగం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. ఊళ్ళలో జరిగే సంఘటనలని చాలా సహజంగా చూపించారు. సినిమా కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది.
కానీ తీసిన విధానం మాత్రం ఆకట్టుకునే లాగా ఉంది. ఒక కమర్షియల్ సినిమాకి దూరంగా, చాలా సహజంగా, కేవలం ఎమోషన్స్ తో మాత్రమే సినిమా నడుస్తుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పాత్రల్లో నటించిన ప్రతి నటీనటులు ఆ పాత్రకి తగ్గట్టుగా నటించారు. కానీ తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి నటన హైలైట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
- కాన్సెప్ట్
- కామెడీ
- పాటలు
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
- హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్:
కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి, ఎమోషనల్ గా సాగే సినిమాలని ఇష్టపడే వారికి బలగం సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలని బాగా ఇష్టపడే ప్రేక్షకులని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు.
watch trailer :
End of Article