తల్లి గురించి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ ప్రియాంక..ఏమైందంటే.?

తల్లి గురించి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ ప్రియాంక..ఏమైందంటే.?

by Sainath Gopi

Ads

మన సీరియల్ హీరోయిన్స్ కి కూడా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అలా, కొంత కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్. ప్రియాంక జైన్ ప్రస్తుతం జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపట్టి, మంచి పోటీ ఇచ్చి, మరింతగా పాపులర్ అయ్యారు.

Video Advertisement

serial actress priyanka jain to act with this star hero

తాజాగా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో షేర్ చేశారు. తన తల్లి ఫాల్గుణి జైన్ క్యాన్సర్ బారిన పడ్డారని, సర్జరీ జరుగగా, ప్రస్తుతం కోలుకుంటున్నారని ప్రియాంక మరియు శివకుమార్ ‘నెవర్ ఎండింగ్ స్టోరీస్’ యూట్యూబ్ ఛానెల్ లో పంచుకున్నారు. ప్రియాంక జైన్ కన్నీటిపర్యంతం అయ్యారు… ఆమె మాట్లాడుతూ “మీరు చూసింది మా అమ్మనే. క్యాన్సర్ వ్యాధితో ఆమె అడ్మిట్ అయ్యి  హాస్పిటల్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి, లైఫ్ చాలా మారిపోయింది.

తన వాళ్లతో బెంగుళూరుకు వచ్చి సంతోషంగా ఉందమని అనుకున్నాను. కుటుంబంతో గడపాలని భావించిన సమయంలో అమ్మకి ఇటువంటి కండిషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ లో ఉన్న టైమ్ లోనే ఆమె తల్లికి పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం ప్రారంభం అయ్యిందంట. అయితే మెనోపాజ్ స్టేజ్ లో ఇలాంటివి కామన్ అని ఫాల్గుణి జైన్ అంతగా పట్టించుకోలేదంట.

ప్రియాంక బిగ్ బాస్ నుండి వచ్చిన అనంతరం తల్లికి అదే కండిషన్ కొనసాగడంతో హాస్పటల్ కు తీసుకెళ్లి టెస్ట్ లు చేసిన తరువాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌ అని డాక్టర్లు చెప్పారంట. దాంతో వెంటనే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి యూట్రస్‌ను రిమూవ్ చేశారట. ప్రస్తుతం ప్రియాంక తల్లి కోలుకుంటున్నట్లుగా ప్రియాంక వీడియోలో  తెలిపారు.


End of Article

You may also like