నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!

నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!

by Harika

Ads

ప్రియాంక సింగ్ ఇప్పుడు పరిచయం అక్కర్లేని ఒక సెలబ్రిటీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా వచ్చి మరింత ఫేమస్ అయింది ప్రియాంక. మొదట ఈమె జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేస్తూ ఫుల్ ఫామ్ ని సంపాదించుకుంది. అబ్బాయిగా ఉండగానే షోలో జాయిన్ అయిన తర్వాత ఆమె ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయింది.

Video Advertisement

అయితే గత కొద్ది రోజులుగా ప్రియాంక ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. పది రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ ముద్దుగుమ్మ డీ జోడి డాన్స్ షో చేస్తుంది. యాంకర్ శివతో కలిసి ఈమె స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అలవాటు లేని పని కావడంతో విపరీతంగా బాడీపెయిన్స్ రావటం వలన ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు యూస్ చేసిందంట ప్రియాంక. అలా మాత్రలు వేసుకొని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది.

ఆమె ఆరోగ్యం ఎంతగా పాడైందంటే కిడ్నీలు కూడా పాడైపోయే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం డిహైడ్రేషన్ ఎక్కువై విపరీతమైన జ్వరంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గత పది రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రియాంక. రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ నరకం చూస్తుంది. అయితే తాను చేసిన తప్పు మరెవరూ చేయకూడదనే ఉద్దేశంతో దీనంతటిని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది ప్రియాంక. ఐస్ వాటర్ టాస్క్ ఆడి కాళ్ళకు చర్మం ఊడిపోగా జండుబాం రాసి వాటిని మరింత ఎక్కువ చేసింది. ఇప్పుడు కూడా తనకు తానే తెలిసీ తెలియని వైద్యం చేసుకుని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని హాస్పిటల్ పాలయింది.


End of Article

You may also like