Home Filmy Adda ఆ రీమేక్ సినిమా వల్ల నష్టపోయాం..! నిర్మాత కామెంట్స్..!

ఆ రీమేక్ సినిమా వల్ల నష్టపోయాం..! నిర్మాత కామెంట్స్..!

by Mohana Priya

మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త ఇలాంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసిన కీరవాణి కొడుకు శ్రీ సింహ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీ సింహా కోడూరి మరియు నేహా సోలంకి జంటగా నటించిన క్రైమ్ ,కామెడీ మూవీ ‘భాగ్ సాలే’.

ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్లో‌లో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమలు నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈనెల 7న విడుదల కానుంది.

producer comments on a remake movie

ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అర్జున్ దాస్యన్ చిత్రం గురించి వివరించారు. కష్టపడకుండా జీవితంలో అతి తక్కువ టైంలో ఎదగాలి అనుకుని ఒక కుర్రాడు లైఫ్ లో ఫైనల్ గా ఏం జరుగుతుంది? అని కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ యొక్క కథ నిర్మించడం జరిగిందట. ఈ మూవీలో హీరో అర్జున్ క్యారెక్టర్ శ్రీ సింహ పోషించారు. ఈ చిత్రానికి సంబంధించి సోమవారం విడుదలైన ప్రేమ కోసం అనే మాస్ సాంగ్ బాగా పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది.

producer comments on a remake movie

ఒరిజినల్ స్టోరీ కంటే కూడా డైరెక్టర్ ఈ చిత్రాన్ని పదిరెట్లు బాగా తీశారని అర్జున్ దాస్యన్ అన్నారు. కార్తికేయ 2 చిత్రంలో లాగా ఇందులో కూడా కాస్త కృష్ణుడికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పారు. ఈ మూవీకి కాలభైరవ మంచి మ్యూజిక్ అందించాలని అన్నారు.

producer comments on a remake movie

ఇక మూవీ రీమిక్కుల విషయం గురించి మాట్లాడుతూ తాను నిర్మించినటువంటి డియర్ మేఘ చిత్రం కన్నడ దియాకు రీమేక్ అని. కానీ అనూహ్యంగా డియర్ మేఘ విడుదల రోజుని దియా యూట్యూబ్ లో విడుదల అయిందని అర్జున్ దాస్యన్ పేర్కొన్నారు. ఈ కారణంగా చిత్రం బాగా నష్టపోయిందని…దాంతో రీమేక్ మూవీ చేసే ఉద్దేశం మానుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ : ఏజెంట్ OTT రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతోంది..? కారణం ఇదేనా..?

You may also like