JANASENA: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత… ఎవరో తెలుసా.?

JANASENA: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత… ఎవరో తెలుసా.?

by Harika

Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. జనసేన పార్టీ కూడా ప్రచారంలో జోరు పెంచింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచార పనుల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే జనసేన పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్న నాయకులని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Video Advertisement

కే ఎల్ పి మూవీస్ సంస్థ అధినేత, IQ మూవీతో నిర్మాతగా మారిన బిజినెస్ మాన్ కాయగూరల లక్ష్మీపతి గారు సోమవారం నాడు జనసేన పార్టీలో చేరారు. లక్ష్మీపతి తండ్రిగారు నారాయణస్వామి గారు టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసారు. గతంలో లక్ష్మీపతి గారు ఆర్టిఏ (RTA) బోర్డు మెంబర్ గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్నారు. అనంతపురం లో ప్రభుత్వ స్థలములో శాశ్వత ఆర్ టి ఓ కార్యాలయము నిర్మించుటకు కృషిచేసి నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాదు కె ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు దుప్పట్లు, చేతి కర్రలు పంచడమే కాదు… నీళ్ల ట్యాంకు నిర్మాణం కూడా చేయించారు. అఖిలభారత కాపు సమాఖ్య నందు ప్రధాన కార్యదర్శిగా చేసారు ఆయన.

సోమవారం రోజు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన గెలుపు కోసం ప్రజాసేవ కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్మీపతి గారికి సూచించారు. ఈ సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొన్నాను. సినిమాలు అంటే ఇష్టం ఉండడంతో IQ సినిమా ద్వారా నిర్మాతగా మారాను. సినీ ఇండస్ట్రీ నుండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వారు అందరికి కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ టికెట్ కేటాయిస్తే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేందుకు సిద్దమే”…అని అన్నారు.


End of Article

You may also like