ఇటీవల కోటి రూపాయలు గెలుచుకుని కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో  అత్యంత ఎక్కువ మొత్తం గెలుచుకున్న వారిలో ఒకరిగా నిలిచారు హిమానీ బుందేలా. ఆగ్రాకు చెందిన హిమానీ దృష్టి లోపంతో బాధపడుతున్నప్పటికి కూడా కోటి రూపాయలు గెలుచుకోవడంతో అందరూ హిమానీ గురించి చర్చించుకుంటున్నారు. అందరూ హిమానీని అభినందిస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి కూడా మాట్లాడారు.

pvp about himani bundela

ప్రసాద్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసి ఈ విధంగా రాశారు. “కళ్ళు ఉన్నోళ్లు కనిపించింది చూస్తారు! దిమాగ్ ఉన్నోళ్లు దునియా మొత్తం చూస్తారు! ఆక్సిడెంట్ లో చూపు కోల్పోయిన హిమనీ, పిల్లలకు సింపుల్ వే లో లెక్కలు చెప్తూ.. నేడు KBC లో కోటి రూపాయలు నెగ్గారు. అన్ని ఉన్న మనం ఇంకేంత కష్టపడాలి??” కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న హిమానీ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియక కోటి రూపాయలు తీసుకొని గేమ్ ఆపారు.