Ads
మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అన్నది మనం వినే ఉంటాం. కానీ ప్రకృతి మనల్ని కరోనా నుండి కూడా కాపాడగలదు అన్న విషయం మీకు తెలుసా? ఇది నిజమే. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం కోవిడ్ 19 ద్వారా చనిపోయే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. దానికి ముఖ్య కారణం వాళ్లు పీల్చే గాలి సరిగా లేకపోవడమే. అంటే వాయు కాలుష్యం.
Video Advertisement
కాబట్టి మన చుట్టూ మొక్కలు చెట్లు ఉంటే వాయు కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాం. ఇజ్రాయెల్ యొక్క పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వాయు కాలుష్యానికి అధిక మరణాలకి కచ్చితంగా సంబంధం ఉందట. వాయు కాలుష్యం వల్ల ఇమ్యూనిటీ తగ్గి వ్యాధులు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అయితే వాయు కాలుష్యం వల్ల ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందట.
ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు వాయు కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తే బతికే అవకాశాలు చాలా తక్కువట. ఇప్పటికీ భారతదేశంలో 1435453 మందికి పాజిటివ్ వస్తే, అందులో 32771 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 16117308 వైరస్ బారిన పడితే, వారిలో 603285 మంది ఈ వైరస్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయారు.
కాబట్టి భవిష్యత్తులో మరణాలు నియంత్రించాలి అంటే మన చుట్టూ ఉన్న గాలి స్వచ్ఛంగా ఉండాలి. గాలి స్వచ్ఛంగా ఉండాలి అంటే చుట్టూ చెట్లు ఉండాలి. అందుకే ఇప్పటినుండి అయినా పెరిగిన చెట్లని కొట్టేయకుండా ఉంచాలి అని, కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడుకుంటే ఒక్క కరోనా నే కాకుండా ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని పర్యావరణ పరిరక్షణ శాఖ వారు చెబుతున్నారు.
End of Article