Ads
ఆడియో టేపుల వ్యవహారంపై ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. తితిదే ఉద్యోగినితో అంటూ వచ్చిన ఆడియోలోని వాయిస్ తనది కాదన్నారు. తన వ్యాఖ్యలపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించాలన్నారు.
Video Advertisement
లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని.. ఎవరు చేశారో, ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న సిబ్బందికి అన్నయ్య లాంటి వాడినని.. సిబ్బంది కూడా అలానే తనను ఆదరిస్తారని ఆయన అన్నారు.
తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని సిబ్బంది కూడా అన్నలా చూస్తారని.. ఒక కుటుంబంలా ఉంటామని ఆయన అన్నారు. ఎస్వీబీసీలో ఉన్న వారందనూ అన్నలా చూస్తారని చెప్పారు. తాను రిటైరైన ఆర్టిస్టునేమీ కాదని.. సినిమాల్లో బిజీగా ఉండి కూడా స్వామి సేవకే అంకితమయ్యానని పృథ్వీ చెప్పారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా అంకితభావంతో పనిచేస్తున్నానన్నారు. అదే విషయం పార్టీ పెద్దలకు కూడా చెప్పానన్నారు.
End of Article