యువకుడితో సంభందం…ఆకలితో ఏడుస్తున్న కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని.!

యువకుడితో సంభందం…ఆకలితో ఏడుస్తున్న కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని.!

by Megha Varna

కన్న కొడుకు ఆకలి కేకల కంటే తన పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి .ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చి తమను డిస్టర్బ్ చేసాడని ఆగ్రహానికి గురి అయ్యి కన్న బిడ్డను కసిగా కొట్టి చంపేసింది .10 టీవీ కథనం ప్రకారం…తమిళనాడు ,కోయంబత్తూరులోని కోయిలమేడు ప్రాంతానికి చెందిన దివ్య అనే ముప్పై సంవత్సరాల మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది.వారికీ ఇద్దరు పిల్లలు.అంత ఆనందంగా సాగుతుందనే సమయంలో కొన్ని గొడవలతో విరిద్దరు విడిపోయారు .తర్వాత దివ్య పిల్లలిద్దరినీ తీసుకుని తుడియలూర్ లో నివాసం ఉంటుంది ..

Video Advertisement

అయితే దివ్యకు రాజాదురై అనే యువకుడితో పరిచయం ఏర్పడింది .క్రమంగా వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది..ఇలా అప్పుడప్పుడు  ఇద్దరు శారీరకంగా కలిసేవారు ..తర్వాత ఇద్దరు కలిసి స్థానికంగా ఉన్న సాయిబాబా కాలనీలో ఇల్లు తీసుకోని అక్కడికి మారి సహజీవనం చెయ్యడం మొదలుపెట్టారు .

ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటంతో ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది .పైగా లాక్ డౌన్ ..వారికీ నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు .కాగా రాజదొరై ‘ ఉన్నప్పుడు పిల్లలని ఆడుకోమని బయటకు పంపించేది .ఈ నేపథ్యంలో మంగళవారం కూడా రాజదొరైతో ఉన్నపుడు యధావిధిగా కొడుకు అభిషేక్ ను దివ్య బయటకు పంపింది ..

బయట ఉన్న అభిషేక్ కు ఆకలి వేయడంతో తీవ్రంగా ఏడవసాగాడు.రాజుదొరై తో కలిసి ఉండగా కొడుకు ఏడవడంతో తీవ్ర కోపం వచ్చింది దివ్య కి ..దీంతో వెంటనే బయటకు వచ్చి పిల్లడ్ని దారుణంగా కొట్టింది .దీంతో అభిషేక్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ..దీంతో భయభ్రాంతురాలైన దివ్య ,రాజాదురై 108 అంబులెన్సు ద్వారా పిల్లవాడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు .పిల్లవాడికి ఏమైంది అని అడగగా ఆడుకుంటూ అనుకోకుండా ఇలా పడిపోయాడని సమాధానమిచ్చింది దివ్య ..దీంతో అనుమానం వచ్చిన 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు .

వెంటనే ఆసుపత్రికి చేరిన పోలీసులు దివ్య ,రాజుదొరై ను అదుపులోకి తీసుకున్నారు .బాలుడ్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయి చాలాసేపు అయ్యింది అని నిర్దారించారు ..పోలీసులు తమ బాణీలో అడిగే సరికి తామే చంపామని దివ్య ,రాజదొరై ఒప్పుకున్నారు .కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు ..

source: 10tv


You may also like

Leave a Comment