“బాహుబలిని దాటేస్తుంది అన్నారు..ఏమైంది..? ” అంటూ… పొన్నియన్ సెల్వన్-1 రిలీజ్ పై 10 మీమ్స్.!

“బాహుబలిని దాటేస్తుంది అన్నారు..ఏమైంది..? ” అంటూ… పొన్నియన్ సెల్వన్-1 రిలీజ్ పై 10 మీమ్స్.!

by Megha Varna

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత తమిళ్ సినిమా పొన్నియన్ సెల్వన్ ఇవాళ విడుదల అయ్యింది. సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందింది. ఆ నవలని సినిమాలాగా తీయాలి అని ఎంతోమంది నటులు, దర్శకులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం కూడా చాలా సంవత్సరాల నుండి ఇది సినిమాలాగా తీయాలి అని అనుకున్నారు.

Video Advertisement

ఇప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కథతో నడిచే సినిమా. సినిమాలో ఫైటింగ్స్, ఎలివేషన్స్ వీటన్నిటికంటే కూడా కథ బలంగా ఉండడం చాలా ముఖ్యం.

అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఇది. కథ ఎంత ఒరిజినల్ గా ఉంటే తెరపై అంత బాగా కనిపిస్తుంది. అందుకే మణిరత్నం కథలో అసలు మార్పులు చేయలేదు. నవలలో ఎలా ఉంటే అలాగే తెరపై చూపించారు. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తం చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. చిన్న పాత్రలు అయినా సరే ఆ పాత్రల కోసం చాలా గుర్తింపు ఉన్న నటులని తీసుకున్నారు. వారందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

కానీ సినిమాలో హైలైట్ గా నిలిచిన పాత్రలు మాత్రం విక్రమ్, కార్తీ పాత్రలు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీ తప్ప మిగిలిన ఎవరూ కనిపించరు. అంత బాగా నటించారు. హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య రాయ్ చూడడానికి బాగున్నారు. నటన పరంగా కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు.  సినిమా మొత్తాన్ని కూడా నడిపించిన మరొక వ్యక్తి ఏఆర్ రెహమాన్. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యాయి. అసలు ఏఆర్ రెహమాన్ సంగీతం లేకుండా ఈ సినిమా ఊహించుకోవడం కూడా కష్టం ఏమో.

అయితే ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుందన్నారు కానీ మణిరత్నం శైలిలో కధ నడిచింది. కానీ అడ్వంచరస్ యాక్షన్ కాదు. టెక్నికల్‌గా చూస్తే ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి మాటలు మాత్రం బాగున్నాయి. ఈ సినిమా విడుదల పై ఇప్పుడు సోషల్ మీడియా లో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ మీమ్స్ లో టాప్ మీమ్స్ ని ఇప్పుడు చూసేద్దాం.

 

#1.

 

#2.

 

#3.

 

#4.

 

 

#5.

 

 

#6.

 

 

#7.

 

 

#8.

 

#9.

 

#10.


End of Article

You may also like