పబ్ జీ పిచ్చిలో మరో కుర్రాడు …తాతయ్య పెన్షన్ నుండి 2 లక్షలు తీసి..?

పబ్ జీ పిచ్చిలో మరో కుర్రాడు …తాతయ్య పెన్షన్ నుండి 2 లక్షలు తీసి..?

by Megha Varna

Ads

కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతా కార్యకలాపాలు నిలిచిపోయాయి.దానితో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పై ఎలాంటి భారాలను మోపకుండా ఉండడం కోసం ఇప్పటికే   పరీక్షలను  ఆన్ లైన్ క్లాస్ లను రద్దు చేసింది.దానితో  కుర్రకారంత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్లోని గేమ్స్ మీద పడిపోయారు.పాపులర్ గేమ్ పబ్ జీ మాయలో పడి ఒక టీనేజ్ యువకుడు తండ్రి బ్యాంక్ ఖాతా నుండి 16 లక్షల ఖర్చు చేసిన ఉదంతం ఈ మధ్య బయటపడింది.

Video Advertisement

ఆ ఉదంతం మర్చిపోకముందే మళ్లీ పంజాబ్ రాష్ట్రంలోనే ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. మొహాలీకి చెందిన 15 ఏళ్ళ కుర్రాడు ఈ సంవత్సరం జనవరి నుండి పబ్ జీ గేమ్ ఆడుతున్నాడు.ఈ గేమ్ లో ఇన్ యాప్ పర్చేస్ కోసం తన తాతయ్య పెన్షన్ ఖాతాను లింక్ చేసి అందులో నుండి దాదాపు 2 లక్షల రూపాయల కొనుగోలు చేశాడు.తాజాగా పెన్షన్ ఖాతాను కుటుంబ సభ్యులు చూసిన సందర్భంలో ఈ ఉదంతం బయటపడింది. పిల్లవాడి బాబాయి పోలీసులకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ను పంపారు.అందులో ప్రత్యేకంగా తమ పిల్లవాడు గేమ్ ఆడడం కోసం కొత్త సిమ్ ను కొనుగోలు చేసిన విషయాన్ని పేర్కొన్నారు.

ఈ వరస సంఘటనలు చూస్తున్న తల్లిదండ్రులు విద్యాసంస్థలు తమ జేబులకు వేస్తున్న చిల్లు కంటే తమ పిల్లలు గేమ్ ల కోసం వేస్తున్న చిల్లులు ఎక్కువని బాధపడుతున్నారట.త్వరలో వీరంతా ప్రభుత్వాన్ని తమ పిల్లల కోసం ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించాలని కోరినా ఆశ్చర్యపడనక్కర్లేదు.


End of Article

You may also like