ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డుల్లో ఫోటోలు తప్పుగా ఉండటం ఇంతకముందు చూసే ఉంటాము. కానీ ఏకంగా పడవ తరగతి పరీక్ష హాల్ టికెట్ లో ఫోటో తప్పు ఉంది. ఒక గేమ్ పేరుతో హాల్ టికెట్ ను విడుదల చేసింది. అంతే కాదు విద్యార్థి తండ్రి పేరులో కూడా ఈ గేమ్ ను జోడించింది. ఫొటోలో కూడా పబ్ జి ఫోటో ఉంది. గేమ్ ఆడుకుంటూ హాల్ టికెట్ తయారు చేసారా ఏంటి?

Video Advertisement

వివరాల లోకి వెళ్తే..స్టూడెంట్ పేరు హిదయత్ పబ్​జీ, తండ్రి పేరు తాహెర్ పబ్​జీ లైట్, తల్లిపేరు రేష్మా ఫాతిమా. కానీ హాల్ టికెట్ లో మాత్రం పబ్ జి. ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యంతో లేని విద్యార్థి పేరుతో ఈ హాల్​టికెట్ బయటకొచ్చింది.హైదరాబాద్‌ నగరంలోని షాలిబండకు చెందిన హిదాయత్ అనే విద్యార్థి ‘S ది స్కూల్’ అనే పాఠశాలలో చదువుకున్నాడు. పడవ తరగతి పరీక్షలు ఈ రోజు మొదలయ్యాయి.

స్కూల్ లో 43 మంది విద్యార్థులున్నారు. కానీ మేనేజ్మెంట్ 44 మంది ఉన్నట్టు అధికారులకు వివరాలు పంపించింది. 43 మంది వివరాలు సక్రమంగానే ఉన్నప్పటికీ, మరొకరికి హిదయత్ పబ్జీ పేరుతో అప్లై చేశారు. ఇష్యూ చేసిన హాల్​టికెట్(2022114399)ను స్కూల్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు.