వాహనదారులకు గమనిక: ఈ డాక్యుమెంట్ లేకపోతే రూ.10000 ఫైన్.! తప్పక తెలుసుకోండి.!

వాహనదారులకు గమనిక: ఈ డాక్యుమెంట్ లేకపోతే రూ.10000 ఫైన్.! తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరానికి మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేసింది. ఇందులో భాగంగా పీయూసీ (PUC) అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కి చెల్లించే జరిమానాను కూడా పెంచింది. పెంచడం అంటే ఏదో 200, 300 పెంచడం కాదు. అలా అని రెట్టింపు కూడా చేయలేదు. జరిమానాను దాదాపు పది రెట్లు పెంచింది.

Video Advertisement

సమయం కథనం ప్రకారం, అంతకు ముందు 1000 రూపాయలు ఉన్న జరిమానా మొత్తం, ఇప్పుడు 10,000 రూపాయలు  అయింది. ఏ వాహనానికి అయినా సరే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. అంతే కాకుండా ఈ డాక్యుమెంట్ కి వాలిడిటీ కూడా ఉండాలి. ఒక వేళ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకపోతే తీసుకోవాలి.

ఒక వేళ ఉన్నా కూడా వాలిడిటీ అయిపోతే రెన్యువల్ చేయించుకోవాలి. ఈ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటే, వాహనం కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు, అలాగే ఆ వెహికల్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగడం లేదు అన్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి ఈ సర్టిఫికెట్ ఉండాలి. ఈ సర్టిఫికెట్ ని వెహికల్ ఓనర్ కి అందజేస్తారు.

ఒక వేళ వెహికిల్ కొత్తగా కొన్నట్టు అయితే, ఆ వెహికిల్ కి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉండదు. వెహికల్ కొన్న ఏడాది తర్వాత నుండి ఈ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. అప్పటి నుంచి రెన్యువల్ చేయించుకుంటూ వెళ్లాలి. ఒక వేళ వెహికల్ కి ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేయించుకోవాలి అన్నా కూడా వాలిడిటీ ఉన్న పీయూసీ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.


End of Article

You may also like