Home Filmy Adda పునీత్ హీరో గా రీమేక్ అయిన 6 సినిమాలు.. లిస్ట్ లో ఈ సినిమాలు ఉన్నాయని అస్సలు ఉహించి ఉండరు..!

పునీత్ హీరో గా రీమేక్ అయిన 6 సినిమాలు.. లిస్ట్ లో ఈ సినిమాలు ఉన్నాయని అస్సలు ఉహించి ఉండరు..!

by Megha Varna

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నిజంగా తీరని లోటు. కన్నడ సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే ముందు మనం పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పుకొని తీరాలి. మంచి యాక్టింగ్ తో, అదిరిపోయే డాన్సులతో, ఫైట్లతో బాక్సాఫీస్ లెక్కలేని పూర్తిగా మార్చేశాడు పునీత్. కన్నడ సినీ పరిశ్రమలో రీమేక్స్ ని ఎక్కువగా తెరకెక్కిస్తారని సంగతి అందరికీ తెలిసినదే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సినిమా నచ్చితే ఎటువంటి హక్కులు కొనుగోలు చేయకుండానే రీమేక్ చేసుకోవచ్చు అనే స్వతంత్రం వారికి ఉన్నట్లు చెబుతూ ఉంటారు. పునీత్ రాజ్ కుమార్ కూడా కొన్ని రీమేక్ సినిమాలు చేశారు. తెలుగులో మంచి హిట్లు అందుకున్న సినిమాలను కన్నడంలో రీమేక్ చేశారు. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం.

#1. అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి:

రవితేజ హీరోగా నటించిన అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా కన్నడలో మౌర్య పేరుతో రీమేక్ చేశారు. అది పునీత్ కి మంచి పేరు తెచ్చింది.

#2. రెడీ:

రామ్ నటించిన రెడీ చిత్రం కూడా కన్నడలో పునీత్ రామ్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇది కూడా పునీత్ కి హిట్ ఇచ్చింది.

Raam (2009) | Raam Kannada Movie | Movie Reviews, Showtimes | nowrunning

#3. ఒక్కడు:

మహేష్ బాబు భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హిట్ లభించింది. ఈ చిత్రాన్ని అజయ్ అనే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు.

Okkadu Movie Full Download | Watch Okkadu Movie online | Movies in Telugu

#4. దూకుడు:

మహేష్ బాబు దూకుడు చిత్రం కూడా కన్నడలో పవర్ పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమా కూడా మంచి హిట్ ని ఇచ్చింది.

ASHOK THE KING: Dookudu review

కన్నడ నుండి తెలుగులోకి రీమేక్ చేసిన సినిమాలు:

#1. అప్పు:

పునీత్ నటించిన అప్పు చిత్రాన్ని తెలుగులో రవితేజ ఇడియట్ పేరుతో రీమేక్ చేశారు.

#2. వీర కన్నడిగ:

రెండు భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు లో పూరి జగన్నాథ్, కన్నడలో మెహర్ రమేష్ తెరకెక్కించారు. కన్నడలో ఇది సూపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం ఫ్లాప్ అయ్యింది.

You may also like