“సక్సెస్ అయితే జీనియస్… ఫెయిల్ అయితే ఫూల్..!” అంటూ… వైరల్ అవుతున్న “పూరి జగన్నాధ్” కామెంట్స్..!

“సక్సెస్ అయితే జీనియస్… ఫెయిల్ అయితే ఫూల్..!” అంటూ… వైరల్ అవుతున్న “పూరి జగన్నాధ్” కామెంట్స్..!

by Mohana Priya

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

కానీ గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచలేదని చెప్పాలి. దీని ముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

అయితే ఇటీవల పూరి జగన్నాధ్, చిరంజీవి కలిసి సోషల్ మీడియాలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో చిరంజీవి పూరి జగన్నాధ్ ని అడిగిన ప్రశ్నకి పూరి జగన్నాధ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి పూరి జగన్నాథ్ ని, “స్క్రిప్ట్ అవి చూసుకుంటున్నావా?” అని అడిగారు. అందుకు పూరి జగన్నాథ్, “నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను స్క్రిప్ట్ చూసుకుంటున్నాను. ఇంక వేరే పని ఏముంటుంది” అని అన్నారు. అలాగే చిరంజీవి మరొక ప్రశ్న కూడా అడిగారు. “అనుకున్న ఫలితం రాకపోతే ఎలా అనిపిస్తుంది?” అని.

అందుకు పూరి జగన్నాధ్, “రిజల్ట్ అంటే సార్, సినిమా సక్సెస్ అయితే ఎనర్జీ వస్తుంది. ఫెయిల్యూర్ అయితే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ అయితే జీనియస్ లాగా కనిపిస్తాము. ఫెయిల్ అయితే ఫూల్ లాగా కనిపిస్తాము” అని అన్నారు. అలాగే పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, “ఒక్కొక్కసారి సినిమా చూసి మనల్ని నమ్మిన వాళ్లు, పని చేసిన వాళ్ళు కూడా రివర్స్ అయిపోతారు. చాలా ప్రెజర్ అనిపిస్తుంది. అలాంటి టైమ్ లో ధైర్యంగా ఉండాలి అంటే కొంత బలం కావాలి. అలా మళ్లీ మామూలు అవ్వడానికి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ టైం పెట్టుకోవాలి అని అనుకుంటాను” అని అన్నారు.


End of Article

You may also like