ప్రస్తుత పరిస్థితిని కరెక్ట్ గా వివరించిన పూరి జగన్నాథ్… ఫ్రీడమ్ దొబ్బింది అనుకుంటున్నారు…కానీ?

ప్రస్తుత పరిస్థితిని కరెక్ట్ గా వివరించిన పూరి జగన్నాథ్… ఫ్రీడమ్ దొబ్బింది అనుకుంటున్నారు…కానీ?

by Sainath Gopi

Ads

ఈ లాక్ డౌన్ పీరియడ్ చాలా కష్టంగా ఉంది. ఫ్రీడమ్ దొబ్బింది. బయటకి వెల్దామంటే పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. తెచ్చిన సరుకులు ఎన్ని రోజులు వస్తాయో తెలీదు. మనలాంటి కష్టాలే చాలామందికి ఉన్నాయి. సరదాగా కొన్ని చెప్తాను. సిరియాలో 2011 నుండి 2019 వరకు వార్ జరిగింది. చాలా సిటీస్ లేవు. లక్షల మంది చనిపోయారు. అక్కడ ప్రజలు ఎక్కడ వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 2014 లో అమ్మాయిలని తీసుకెళ్లిపోయారు. 2019 లో ఇళ్ళకి చేరారు. అన్ని సంవత్సరాలు వారు ఎంత ఏడ్చి ఉంటారు. కొంతమంది వేరే కంట్రీ కి వెళ్తుంటారు. బోర్డర్స్ లో ఇరుక్కుపోతారు. పూరి గారు ఇంకేం చెప్పారో వీడియోలో చూడండి.

Video Advertisement

watch video:

జనతా కర్ఫ్యూ సమయంలో కూడా తన స్టైల్ లో సలహా ఇచ్చారు పూరి…‘‘ఎందుకు చెప్పారో.. మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాట విందాం. ఆదివారం అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే ఆ కరోనా వైరస్ తాలూకు చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయం. సో.. వారి మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఇవాళ కరోనా లేని ప్లేస్‌లోకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే.. ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే వూహాన్. చైనాలో కరోనా వస్తే.. కంట్రీ మొత్తం కట్టగట్టుకుని కరోనాని చావకొట్టారు. సో.. మనం కూడా ఆ పని చేయాలనుకుంటే.. చెప్పిన మాట వినండి.

కొంత మంది నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకి, ఫ్రస్టేట్ అయ్యేవాళ్లకి నా సలహా ఏమిటంటే.. ఆదివారం ఉదయం లేవగానే నాలుగు స్ఫూన్లు ఆముదం తాగండి. మోషన్స్ అవుతాయి. ఇక ఆ పనిలో బిజీగా ఉంటారు. సాయంత్రం అయిపోతది. హ్యాపీగా ఉంటది. సో.. ఇలాంటి టైమ్‌లో నెగిటివ్‌గా లేకుండా చెప్పిన మాట వినండి. రేపందరూ ఇంట్లోనే ఉండండి. లవ్ యు ఆల్..’’ అని చెప్పారు పూరి. కాబట్టి మనం కూడా లాక్ డౌన్ తప్పనిసరిగా పాటిద్దాము. దేశాన్ని కాపాడుకుందాము.


End of Article

You may also like