పూరి జగన్నాధ్ “అంకుల్ ఆంటీ” పోడ్కాస్ట్ సూపర్ ఎడిటింగ్…బ్రహ్మి వెర్షన్ లో.!

పూరి జగన్నాధ్ “అంకుల్ ఆంటీ” పోడ్కాస్ట్ సూపర్ ఎడిటింగ్…బ్రహ్మి వెర్షన్ లో.!

by Mohana Priya

Ads

లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలు తమలో ఉన్న ఇంకొక టాలెంట్ ని బయటికి తీసుకొస్తున్నారు. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒక పాడ్ క్యాస్ట్ మొదలుపెట్టారు. నిడివి తక్కువ ఉన్నా కూడా అందులో పూరి జగన్నాథ్ చెప్పే విషయాలు మాత్రం రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇటీవల అంకుల్ ఆంటీ పేరుతో ఒక పాడ్ క్యాస్ట్ విడుదల చేశారు పూరి జగన్నాథ్. అందులో ఏం చెప్పారంటే.

Video Advertisement

కళ్ళు మూసి తెరిచేలోపు స్కూల్ డేస్ అయిపోతున్నాయి. పది రూపాయలు సంపాదించకముందే పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఫస్ట్ శాలరీ అందుకునే టైం కి ఇంట్లో ఇద్దరు పిల్లలు రెడీ. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సరికి 50 ఏళ్లు వస్తున్నాయి. పోనీ ఇప్పుడైనా సర్దుకుందాం అనే లోపు ప్రాణాలు పోతున్నాయి. బ్యాంకాక్ వెళ్లే టైం ఉండట్లేదు. అలా తిరిగొద్దాం అంటే కుదరట్లేదు.

మనసేమో డిస్కో డాన్స్ ఆడుతుంది. ఎలారా భగవంతుడా అని మా టెన్షన్ లో మేము ఉంటాం. త్వరగా పెళ్లి అయిపోయి 30 ఏళ్లకే ఇద్దరు పిల్లలు ఉన్న సరిత అద్దంలో చూసుకుంటూ ఉంటే పక్కింటి 20 ఏళ్ల అమ్మాయి వచ్చి “ఆంటీ!” అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఎక్కడో కాలదూ? “ఏంటమ్మా?” అని బయటికి అంటారు కానీ దానికి ఒళ్లంతా వాతలు పెట్టాలి అని ఉంటుంది.

నాకేమో ఇంకా 40 నిండలేదు. పబ్ లో ఎవరో ఒక అమ్మాయి కనిపించింది. కార్నర్ టేబుల్ మీద కూర్చొని ఆ డిమ్ లైట్ లో ఎంతో ఎక్సైటింగ్ గా ఆ అమ్మాయి తో మాట్లాడుతున్నా. ఒక ఎదవ వచ్చాడు. పాతికేళ్లు ఉంటాయి. “అంకుల్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? పబ్ కి కూడా వస్తారా?” అంటే ఎలా ఉంటుంది? అమాంతం వాడిని టేబుల్ కేసి కొట్టాలనిపించింది.

ఇదిగో మీ యంగ్ జనరేషన్ కి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అంకుల్, ఆంటీ అని మమ్మల్ని పిలవద్దు. పేరు పెట్టి పిలవండి. సార్ అని పిలవండి. లేదా ప్రభాస్ లాగా అందరిని డార్లింగ్ అని పిలవండి. అలా పిలిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేగాని అంకుల్, ఆంటీ అని అంటే చావగొట్టాలని ఉంది అందరిని” అని అన్నారు పూరి జగన్నాథ్. ఈ పాడ్ క్యాస్ట్ మీద సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో కూడా విడుదలైంది. ఆ వీడియో ఇదే. మీరు కూడా చూసేయండి.

watch edited video:

watch original video:


End of Article

You may also like