Ads
ఆన్ లైన్లో జరిగే మోసాల గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం.అయినాగానీ ఇంకా ఇలాంటి వాళ్ళ భారిన పడి మోసబోతున్నారు కొంతమంది.అయితే తాజాగా ఓ వ్యక్తి ఒక హోటల్ ఓనర్ కు కాల్ చేసి 50 ప్లేట్ల పూరి ఆర్డర్ చెప్పి ఆ వ్యక్తి ఖాతాలో నుండి 25 వేలు తస్కరించాడు.ఆ పూర్తీ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
Video Advertisement
జమ్మికుంట ప్రాంతంలోని చందాన హోటల్ కు ఓ వ్యక్తి కాల్ చేసి నేను మిలిటరీ లో పనిచేస్తున్నాను అని నేను ఇప్పుడు కొంచెం దూరం వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు 50 ప్లేట్ల పూరీలు పార్సెల్ చేసి ఉంచామని చెప్పాడు.దీంతో చందాన హోటల్ యజమాని మొగిలి వెంటనే 50 ప్లేట్ల పూరీలు పరిసిల్ చేయించాడు. అయితే ఆ వ్యక్తి మొగిలి కి కాల్ చేసి నేను దారిలో ఉన్నాను అని ఎటిఎం కార్డు డీటెయిల్స్ పంపిస్తే మీకు మనీ పంపిస్తాను అని చెప్పడంతో మొగిలి వాట్స్ యాప్ లో ఆ వ్యక్తి కి ఎటిఎం కార్డు డీటెయిల్స్ పంపించాడు.
అయితే ఆ తర్వాత మొగిలి కి కాల్ చేసి మీ మొబైల్ కు ఒక నెంబర్ వచ్చింది అది చెప్తేనే నేను మీకు డబ్బులు పంపగలను అని చెప్పాడు ఆ వ్యక్తి.అయితే అది నమ్మిన మొగిలి తన మొబైల్ కు వచ్చిన ఓటీపీ ను ఆ వ్యక్తి కి పంపించాడు..ఆ వ్యక్తి అదే విధంగా మూడుసార్లు ఓటీపీ అడిగి మొత్తం 25 వేల రూపాయలు తస్కరించాడు.అయితే మోసపోయాను అని తెలుసుకున్న మొగిలి తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
End of Article