Home Filmy Adda ”పుష్ప 2” లో… మొదట షూట్ చేయబోతున్న సీన్ ఇదేనా ..?

”పుష్ప 2” లో… మొదట షూట్ చేయబోతున్న సీన్ ఇదేనా ..?

by Megha Varna

“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

is allu arjun following that sentiment for pushpa 2..??

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన అవినాష్ గోవరికర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని అంటున్నారు. సినిమా షూటింగ్ అయితే షురూ అయ్యి పోయింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ రెండో వారం లో రామోజీ ఫిలిం సిటీ లో మొదలు అవ్వనుంది.

is allu arjun following that sentiment for pushpa 2..??

ఇందులో బన్నీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సెట్ ని కూడా స్పెషల్ గా సిద్ధం చేశారట. అలానే అంచనాలను మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే బన్నీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అలానే దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప: ది రైజ్ గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు పుష్ప 2కి కూడా సుకుమార్, బన్నీ ‘డిసెంబర్’ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

You may also like